Dividend News: దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తలలో గౌతమ్ అదానీ పేరు ప్రత్యేకంగా చెప్పాలి. ఎందుకంటే అసామాన్యమైన ప్రతిభతో దాదాపు నేలమట్టమవుతున్న తన కంపెనీలను సింగిల్ హ్యాండ్ తో ఆకాశానికి ఎత్తిన ధీశాలి. అమెరికా సంస్థ ఆరోపణలను ఎదిరించి ధైర్యంగా నిలబడ్డారు. రిటైర్డ్ ఇన్వెస్టర్ల నమ్మకం కోల్పోయినా విదేశాల్లోని సంస్థాగత పెట్టుబడి సంస్థల నుంచి కీలక ఇన్వెస్ట్మెంట్ ఆఫర్స్ పొందారు. కాగా ఇప్పుడు అదానీ గ్రూప్ నుంచి 3 కంపెనీలు డివిడెండ్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నాయి.
అదానీ టోటల్ గ్లాస్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్&సెజ్ కంపెనీలు ఇన్వెస్టర్లకు డివిడెండ్ ప్రకటించాయి. ఎక్స్ డివిడెండ్ తేదీని జూన్ 14గా నిర్ణయించాయి. దీంతో ఆయా కంపెనీల స్టాక్స్ హోల్డ్ చేస్తున్నవారు ఆ మొత్తాన్ని పొందేందుకు అర్హులుగా భావించవచ్చు. సంస్థను బట్టి డివిడెండ్ అమౌంట్ మారుతూ ఉంటుందని గమనించాలి. ఒక్కో షేర్ కి కనిష్ఠంగా పావలా నుంచి 6 రూపాయలు వరకు ఆ కంపెనీలు చెల్లించనున్నాయి.

సదరు 3 కంపెనీల్లో అదానీ టోటల్ గ్యాస్ షేర్ కు 0.25 రూ. చొప్పున డివిడెండ్ ప్రకటించింది. షేర్ హోల్డర్ల ఆమోదం తర్వాత సదరు అమౌంట్ ఇన్వెస్టర్ల బ్యాంక్ ఖాతాలో జమకానుంది. ప్రస్తుతం 945 వద్ద ట్రేడ్ అవుతున్న ఈ స్టాక్.. భవిష్యత్తులో 1,100 వరకు వెళ్లవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 1.30 రూ.లతో అదానీ ఫ్లాగ్ షిప్ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ తర్వాత స్థానంలో నిలిచింది. ప్రస్తుతం 3 వేల 250 రేంజ్‌లోని షేర్ ధర రానున్న రోజుల్లో దాదాపు 3 వేల 500 స్థాయికి చేరుతుందని భావిస్తున్నారు.
అదానీ గ్రూపులోని మరో కీలక కంపెనీ పోర్ట్స్ అండ్ సెజ్ కూడా డివిడెండ్ అనౌన్స్ చేసింది. ఇతర 2 కంపెనీలకు భిన్నంగా షేర్ కు 6 చొప్పున ఇవ్వనున్నట్లు ప్రకటించింది. కంపెనీ వార్షిక సమావేశంలో ఇందుకు అనుగుణంగా షేర్ హోల్డర్ ల ఆమోదం పొందాలని భావిస్తోంది. కాగా ప్రస్తుతం 1,400 వద్ద కొనసాగుతున్న స్టాక్ భవిష్యత్తులో 1,500కు పైగా ట్రేడ్ కావడం చూడవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications