Adani News: సుప్రీంకోర్టు తీర్పుతో గౌతమ్ అదానీకి జాక్‌పాట్.. ఏకంగా అంబానీనే టార్గెట్‌గా..
Ambani News: గతేడాది ప్రారంభంలో అదానీ గ్రూప్ మీద వచ్చిన ఆరోపణలపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఇటీవల స్పందించింది. దీంతో అప్పటి నుంచి ఆయా కంపెనీల స్టాక్స్ రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి. ఏకంగా అంబానీ సీటుకే ఎసరు పెట్టే రేంజ్ లో బుల్స్ రన్ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
స్టాక్ ప్రైస్ మ్యానిప్యులేషన్ ఆరోపణలపై మార్కెట్ రెగ్యులేటర్ ఇప్పటికే దర్యాప్తు చేస్తోంది. దీంతో ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. దీన్ని అదానీ గ్రూప్ కు అనుకూలంగా ఇన్వెస్టర్లు పరిగణిస్తున్నారు. ఒక్కసారిగా ఏర్పడిన బజ్ తో స్టాక్ విలువ బుధవారం 12 శాతం పెరిగి పెరింది. మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ 15 లక్షల కోట్లకు చేరింది.

ఫలితంగా గౌతమ్ అదానీ కుటుంబం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఫ్యామిలీని అధిగమించింది. దేశంలో అత్యంత సంపన్న ప్రమోటర్‌గా తిరిగి తన స్థానాన్ని అదానీ నిలబెట్టుకున్నారు. బుధవారం నాటికి అదానీ కుటుంబం నికర విలువ 9.37 లక్షల కోట్లకు పెరిగింది. అయితే గతంలో వీటి విలువ 8.98 లక్షల కోట్లు. ఇదే సమయంలో ముఖేష్ అంబానీ కుటుంబం నికర విలువ ₹9.38 లక్షల కోట్ల నుండి 9.28 లక్షల కోట్లకు పడిపోయింది.
పెండింగ్‌లో ఉన్న రెండు దర్యాప్తులను 3 నెలల్లోగా ముగించాలని SEBIని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరపాలని మార్కెట్ రెగ్యులేటర్లను ఆదేశించింది. అందుకే ప్రత్యేక దర్యాప్తు బృందం లేదా CBIకి కేసు బదిలీని నిరాకరించింది. వార్తాపత్రికలు, OCCRP వంటి థర్డ్ పార్టీ సంస్థల నివేదికపై ఆధారపడి, సమగ్ర దర్యాప్తును అనుమానించడం సరికాదని అభిప్రాయపడింది.


Click it and Unblock the Notifications