Heidelberg Cement: దేశంలోని వేగంగా సంపదను పెంచుకుంటున్న వ్యాపారవేత్తల్లో ముందువరుసలో ఉన్న వ్యక్తి గౌతమ్ అదానీ. ఈ క్రమంలో తన వ్యాపారాలను నెం1 స్థాయికి చేర్చేందుకు అదానీ తీవ్రంగా శ్రమిస్తూనే ఉన్నారు. అయితే పోర్ట్స్ నుంచి ఎయిర్ పోర్ట్స్ వరకు అనేక రంగాల్లో వ్యాపారాలను నిర్వహిస్తున్న అదానీ ప్రస్తుతం కొత్త కంపెనీల కొనుగోలు విషయంలో వేగంగా ముందుకు సాగుతున్నారు.
దేశంలో నిర్మాణ రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న వేళ అదానీ గ్రూప్ యజమాని గౌతమ్ అదానీ సిమెంట్ వ్యాపారాన్ని మరింతగా విస్తరింప జేసేందుకు కృషిచేస్తున్నారు. ఇప్పటికే ఏసీసీ, అంబుజా, సంఘీ సహా అనేక కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసిన అదానీ తాజాగా జర్మన్ సిమెంట్ కంపెనీ హైడెల్‌బర్గ్ భారతీయ యూనిట్‌పై దృష్టి పెట్టారు. వాస్తవానికి ప్రపంచంలో అతిపెద్ద సిమెంట్ ఉత్పత్తిదారుల్లో ఒకటిగా ఉన్న ఈ సంస్థ భారతీయ యూనిట్ కొనుగోలుకు అదానీ గ్రూప్ కంపెనీ అయిన అంబుజా సిమెంట్స్ నాయకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ డీల్ విలువ దాదాపు రూ.10,000 కోట్లుగా ఉన్నట్లు సమాచారం. దూకుడు పెంచిన అదానీతో పోటీపడేందుకు బిర్లాలకు చెందిన అల్ట్రాటెక్ కంపెనీ తన స్థానాన్ని నిలబెట్టుకునే క్రమంలో కొత్త కంపెనీల కొనుగోళ్లు చేపడుతూనే ఉంది.

ప్రస్తుతం దేశంలో అదానీ గ్రూప్ సిమెంట్ వ్యాపారంలో రెండవ అతిపెద్ద ఆటగాడిగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే వేగంగా డీల్స్ పూర్తి చేసే పనిలో అదానీ ఉన్నారని తెలుస్తోంది. జూన్ 30, 2024 నాటికి అంబుజా సిమెంట్స్ వద్ద రూ.18,299 కోట్ల నగదు, నగదు సమానమైనవి ఉన్నాయి. ప్రస్తుతం జర్మన్ కంపెనీ లిస్టెడ్ హైడెల్‌బర్గ్ సిమెంట్ ఇండియా, అన్‌లిస్టెడ్ జువారీ సిమెంట్ ద్వారా భారతదేశంలో వ్యాపారాన్ని కొనసాగిస్తోంది. లిస్టెడ్ యూనిట్ మార్కెట్ క్యాప్ రూ.4,957 కోట్లుగా ఉండగా దీనిలో మాతృ సంస్థ ఇందులో 69.39% వాటాను కలిగి ఉంది.

హైడెల్‌బర్గ్ 2006లో కొచ్చిన్ సిమెంట్, ఇండోరమ సిమెంట్‌తో జాయింట్ వెంచర్ అయిన మైసూర్ సిమెంట్‌ను కొనుగోలు డీల్ ద్వారా భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం హైడెల్‌బర్గ్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 దేశాల్లో తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ప్రధాన కార్యాలయానికి చెందిన సీనియర్ అధికారి భారత బృందంతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వ్యవహారంపై రెండు సంస్థల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ డీల్ జరిగితే అదానీ గ్రూప్ దేశీయ సిమెంట్ వ్యాపారంలో కొత్త డీల్స్ చేపడుతూ ముందుకు సాగుతోంది. దీనిని బిర్లా గ్రూప్ అల్ట్రాటెక్ ఎలా ఎదుర్కొంటుందో వేచి చూడాల్సిందే.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications