Adani Cement: అదానీ గ్రూప్ ఈ ఏడాది సిమెంట్ రంగంపై అత్యధికంగా తన దృష్టిని సాధించింది. ఈ క్రమంలో ఏసీసీ సిమెంట్స్, అంబుజా సిమెంట్స్, సంఘీ సిమెంట్స్ సంస్థలను దక్కించుకుంది.
అయితే ఈ క్రమంలో భారత బిలియనీర్ అదానీ అప్పు చేశారు. ప్రధానంగా ఏసీసీ సిమెంట్స్, అంబుజా సిమెంట్ కంపెనీల కొనుగోలు కోసం 3.5 బిలియన్ డాలర్లను వివిధ సంస్థల నుంచి పొందిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం వీటిని విజయవంతంగా రీఫైనాన్సింగ్ పూర్తి చేసింది. మూడు సంవత్సరాల వరకు రుణ మెచ్యూరిటీతో అంతర్జాతీయ బ్యాంకుల క్లచ్‌తో ఇది ముగిసింది.

10 అంతర్జాతీయ బ్యాంకులు ఈ మెగా రుణ రీఫైనాన్స్ చేశాయని సంస్థ అదానీ గ్రూప్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇది కంపెనీ గ్లోబల్ ఫైనాన్స్ మార్కెట్లతో ఉన్న యాక్సెస్, బలమైన లిక్విడిటీకి అద్దం పడుతోంది. ఈ విజయం ఆర్థిక స్థిరత్వం, వృద్ధిపై కంపెనీ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. తాజా రుణ సదుపాయం అదానీ సిమెంట్ వర్టికల్ కోసం మొత్తం 300 మిలియన్ డాలర్ల ఖర్చును ఆదా చేస్తుందని కంపెనీ స్పష్టం చేసింది.
బ్యాంకులతో నెలల తరబడి జరిగిన చర్చల తర్వాత ఈ ఫైనాన్సింగ్ డీల్ విజయవంతమైంది. అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణలు, ఆ తర్వాత కూడా అదానీపై దేశీయంగా, ప్రపంచ స్థాయిలో గౌతమ్ అదానీ కంపెనీల పెట్టుబడులపై దర్యాప్తు జరగటం కొనసాగుతూనే ఉంది. దేశంలో మార్కెట్ రెగ్యులేటరీ సెబీ సైతం తన దర్యాప్తును కొనసాగిస్తోంది. అంతర్జాతీయ పత్రికలు సైతం అదానీ బొగ్గు అమ్మకాలపై ఆరోపణలు, యుద్ధం కారణంగా ఇజ్రాయెల్ పోర్టు వ్యాపారంలో నెలకొన్న ఇబ్బందుల మధ్య తాజా పరిణామం చోటుచేసుకోవటం గమనార్హం. గ్రూప్ ప్రధాన సంస్థ జూలైలో స్థానిక కరెన్సీ బాండ్లను జారీ చేయడం ద్వారా ఇప్పటికే 12.5 బిలియన్ రూపాయలను సమీకరించింది.


Click it and Unblock the Notifications