Adani Company: అదరగొట్టిన అదానీ కంపెనీ.. నష్టాల నుంచి భారీ లాభాల్లోకి..
ACC Q2 Results: రోజూ అదానీ కంపెనీల గురించే ఎక్కువగా వార్తల్లో నెగటివ్ వార్తలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నది మాత్రం గౌతమ్ అదానీ సాధించిన అతిపెద్ద విజయంగా చెప్పుకోవచ్చు. దీనికోసం ఆయన పెద్ద సాహసం కూడా చేశారు.
అదానీ గ్రూప్ సిమెంట్ వ్యాపారంలో తన ఉనికిని పెంచుకునే క్రమంలో పెద్ద సంస్థలను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అదానీ సిమెంట్స్ దక్కించుకున్న ఏసీసీ లిమిటెడ్ తన సెప్టెంబర్ త్రైమాసికంలో అద్భుతమైన పనితీరును కనబరిచింది. క్యూ2లో కంపెనీ రూ.388 కోట్ల కన్సాలిడేటెడ్ లాభాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.87 కోట్ల నష్టాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. అదానీ చేతిలో పడగానే కంపెనీ లాభాల బాట పట్టింది.

కంపెనీ నికర అమ్మకాలు సెప్టెంబర్ క్వార్టర్‌లో ఏడాది ప్రాతిపదికన 11.23 శాతం పెరిగి రూ.4,435 కోట్లకు చేరుకున్నాయని అదానీ గ్రూప్ కంపెనీ తెలిపింది. త్రైమాసికంలో Ebitda రూ.86 కోట్ల నుంచి రూ.759కి అనేక రెట్లు పెరిగింది. క్యూ2లో అమేథా యూనిట్‌లో క్లింకర్ ఉత్పత్తిని ప్రారంభించినట్లు ACC తెలిపింది. ఈ కాలంలో క్లింకర్ & సిమెంట్ అమ్మకాల పరిమాణం 17.3 శాతం పెరిగాయి. కంపెనీ ప్రధానంగా నిర్వహణ వ్యయాలను తగ్గించుకోవటంతో మంచి లాభాలను నమోదు చేసింది.
ప్రీమియం సిమెంట్ ఉత్పత్తులకు డిమాండ్ 1.5 శాతం పెరిగి 32 శాతానికి చేరుకోవటం తాజా వృద్ధికి కారణమని CEO అజయ్ కపూర్ వెల్లడించారు. సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ కొత్తగా మార్కెట్లో 543 డీలర్లను నికరంగా పెంచుకుంది. WHRS, పునరుత్పాదక శక్తి ద్వారా గ్రీన్ పవర్‌ను నొక్కే చర్యలు కొనసాగుతున్నాయని, ESG లక్ష్యాలను సాధించడంలో సహాయపడటమే కాకుండా లాభదాయకతను పెంచుతుందని కంపెనీ వెల్లడించింది.


Click it and Unblock the Notifications