Adani Family: రోజూ అదానీ పేరు వార్తల్లో ఏదో ఒక కారణంగా వినిపిస్తూనే ఉంటుంది. తాజాగా ఆయన సోదరుడి పేరు వినిపించటం మెుదలైంది. వినోద్ శాంతిలాల్ అదానీ దుబాయ్‌లో నివసిస్తున్నారు. సింగపూర్, దుబాయ్, జకార్తాలో వ్యాపారాలను చూసుకుంటున్నారు. 1976లో ముంబయిలో వస్త్ర వ్యాపారాన్ని ప్రారంభించి సింగపూర్‌కి విస్తరించారు. గౌతమ్ అదానీ అన్నయ్య 1994లో దుబాయ్ వెళ్లిన తర్వాత తన వ్యాపారాన్ని మిడిల్ ఈస్ట్‌కు కూడా తీసుకెళ్లారు.

IIFL తాజా నివేదిక..
IIFL వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్- 2022 ప్రకారం వ్యాపారవేత్త గౌతమ్ అదానీ ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్నుడిగా నిలిచారు. ఆయన సోదరుడు వినోద్ శాంతిలాల్ అదానీ కూడా సంపద రేసులో వెనుకంజ వేయలేదు. దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త వినోద్ శాంతిలాల్ అదానీ రూ.1,69,000 కోట్ల సంపదతో ఆరవ స్థానంలో అత్యంత సంపన్న భారతీయుడిగా నిలిచారు. గత ఐదేళ్ల కాలంలో వినోద్ శాంతిలాల్ అదానీ సంపద 9.5 రెట్లు పెరిగింది.

శాంతిలాల్ వ్యాపారాలు..
వినోద్ శాంతిలాల్ అదానీ ఇంధనం, మౌలిక సదుపాయాల వ్యాపారంలో సోదరుడు గౌతమ్ అదానీ మాదిరిగానే కొనసాగుతున్నారు. గత ఐదేళ్లలో గౌతమ్ అదానీ కుటుంబ సంపద 15.4 రెట్లు పెరిగింది. అదే సమయంలో వినోద్ శాంతిలాల్ అదానీ సంపదం మాత్రం 9.5 శాతం పెరిగింది. ఈ క్రమంలో అతని నికర విలువ 28% లేదా రూ.36,969 కోట్లు పెరిగింది.

రోజువారీ సంపద సృష్టి..
వినోద్ శాంతిలాల్ అదానీ 2021 నుంచి ప్రతిరోజూ రూ.102 కోట్లకు పైగా సంపాదించారు. ఇద్దరు అదానీ బ్రదర్స్ మొత్తం సంపద రూ.12,63,400 కోట్లు పెరిగింది. హురున్ ఇండియన్ రిచ్ లిస్ట్ 2022లోని టాప్ టెన్‌లో 40% గా ఉంది. విడుదల చేసిన జాబితాలో 1,103 మంది భారతీయులు ఉండగా.. అందులో మొత్తం 94 మంది ఎన్నారైలు ఉన్నారు. NRIల జాబితాలో అదానీ కుటుంబం మాత్రం టాప్ గేర్ లో ముందుకు సాగుతోంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications