Adani Bribery Scandal: ప్రస్తుతం ఏపీలోని అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అమెరికా కోర్టులో అదానీ లంచాల కుంభకోణం తవ్వేకొద్ది కొత్త విషయాలు విషయాలు బయటకొస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన హై ర్యాంకింగ్ అఫీషియల్స్ లంచాల వ్యవహారంలో చిక్కుకున్నట్లు తేలింది. ఈ క్రమంలో ఏపీకి సంబంధించిన స్టేట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు అదానీ నుంచి 7 గిగావాట్ల సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా అదానీకి ఉత్పత్తి చేసే విద్యుత్తును మ్యూనుఫ్యాక్చరింగ్ లింక్డ్ ప్రాజెక్ట్ కోసం ఒప్పందాల వ్యవహారంలో ఈ కుంభకోణం జరిగింది.
ఈ విషయంలో ఏపీకి చెందిన కీలక అధికారి మార్చి 2019 నుంచి జూన్ 2024 వరకు ప్రభుత్వంలో పనిచేశారని గుర్తించబడింది. ఈ ఒప్పందాల విషయంలో అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ నేరుగా సదరు అధికారిని మూడుసార్లు కలిసినట్లు పేర్కొనబడింది. పవర్ సేల్స్ అగ్రిమెంట్లు వేగంగా జరిగేందుకు నేరుగా అదానీ ఏపీ అధికారుల చుట్టూ తిరిగిన విషయం ప్రస్తుతం బయటపడింది. మ్యానుఫ్యాక్చరింగ్ లింక్డ్ ప్రాజెక్టుల కింద జరిగిన మహాకుంభకోణంలో అదానీ గ్రీన్ కంపెనీ భవిష్యత్తు లబ్ధికోసం ఏకంగా రూ.2,029 కోట్లు ప్రభుత్వ కీలక అధికారులకు లంచాలు ముట్టాయని అమెరికా కోర్టులో వెల్లడైంది. దీనిలో ప్రధాన సూత్రదారులు పెట్టుబడిదారులను మోసం చేశారని పేర్కొనబడింది. ఈ వ్యవహారంలో గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, వినీత్ జైన్ కీలకపాత్ర పోషించినట్లు గుర్తించారు.

ఈ వ్యవహారంలో మరో కీలక వ్యక్తిగా వ్యవహించిన అతను యూకే పౌరుడని కానీ హాంకాంగ్ లో నివసిస్తున్నట్లు వెల్లడైంది. ఈ క్రమంలో నిందితులు నిరంతరం వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ అధికారులను పవర్ సేల్స్ అగ్రిమెంట్లు తమకు అనుకూలంగా పూర్తి చేయాలని కోరుతూ ఒత్తిడి తెచ్చారని, దీంతో స్టేట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు పాల్గొనేలా చేశారని గుర్తించబడింది. ఈ క్రమంలో గౌతమ్ అదానీని అరెస్ట్ చేయాలని అరెస్ట్ వారెంట్ సైతం ఇష్యూ చేయబడింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అదానీ గ్రూప్ మధ్య ఉన్నత స్థాయి ఒప్పందం నేపథ్యంలో ఈ వివాదం కొనసాగుతోంది. జనవరి 2024లో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ఏపీ మాజి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. అక్కడ వారు సోలార్‌తో సహా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులలో రూ.60,000 కోట్ల పెట్టుబడి కోసం అవగాహన ఒప్పందంపై సంతకాలు కూడా చేసుకున్నారు. ఈ క్రమంలో 10,000 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్ట్, 3,700 MW పంప్డ్ హైడ్రో సోలార్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు ఎంవోయూ కుదుర్చుకున్నారు. దీనికి ముందు అదానీ విదేశీ వ్యక్తితో నిరంతర కలయికతో ఏపీ డిస్కంలు అత్యధికంగా 2.3 గిగావాట్ల సోలార్ విద్యుత్ కొనుగోలుకు డిసెంబర్ 1, 2021లో ఒప్పందాలు జరిగాయి.
ఇలా వ్యాపారాన్ని దక్కించుకోవటం కోసం అదానీ గ్రూప్ లంచాలు ఎరవేయటం పెట్టుబడిదారులు, బ్యాంకులను మోసం చేయటమేనని యుఎస్ అటార్నీ బ్రీన్ పీస్ పేర్కొన్నారు. ప్రస్తుతం అదానీ రెన్యూవబుల్ ఎనర్జీ వెంచర్ల పారదర్శకతపై అధిక పరిశీలన ఎదుర్కొంటున్నాయి. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, అదానీ గ్రూప్‌తో రాష్ట్ర లావాదేవీల పారదర్శకత, యాజమాన్యంపై ఆరోపణలు లేవనెత్తుతున్నాయి. అదానీ వ్యాపారాన్ని దక్కించుకోవటానికి చేసిన ప్రయత్నాలు స్కీమ్ ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్‌ను ఉల్లంఘించిందని వెల్లడైంది. అలాగే అదానీ గ్రూప్ దేశంలోని ఛత్తీస్‌గఢ్, తమిళనాడు, ఒడిశా, జమ్మూ కాశ్మీర్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలతో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు చేసుకున్నట్లు అమెరికా కోర్టు ఫైలింగ్స్ ప్రకారం తెలిసింది. ఇలాంటి చర్యలతో అదానీ గ్రూప్ స్టాక్ ఎక్స్ఛేంజీలను మోసం చేసిందని ఆరోపించింది. అంతర్జాతీయ స్థాయిలో ఆరోపణలు వచ్చినప్పటికీ అదానీ గ్రూప్ మాత్రం వీటిని బేస్ లెస్ అలిగేషన్స్ అంటూ కొట్టిపడేస్తోంది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications