Adani Vs Ambani: యోగి రాజ్యంలో పోటీపడుతున్న అదానీ-అంబానీ.. బిడ్స్ దాఖలు..
Green Mobility: ప్రస్తుతం అదానీ, అంబానీలతో పాటు దేశంలోని ఇతర అనేక సంస్థలు గ్రీన్ మెబిలిటీ రంగంలోకి అడుగుపెట్టేందుకు ప్లాన్ చేస్తున్నాయి. దీంతో మరోసారి దిగ్గజ వ్యాపారవేత్తలు వార్తల్లో నిలిచారు.
వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్‌లో గ్రీన్ మొబిలిటీ ప్రాజెక్ట్ కోసం అదానీ టోటల్ ఎనర్జీస్, రిలయన్స్ పోటీ పడుతున్నాయి. ఇందుకోసం రెండు గ్రూప్స్ బిడ్స్ సైతం దాఖలు చేశాయి. వీటికి తోడు GMR ఎనర్జీ, సీమెన్స్‌తో సహా మెుత్తం డజనుకు పైగా ప్రముఖ పునరుత్పాదక ఇంధన సంస్థల మధ్య ప్రాజెక్టును దక్కించుకోవటం కోసం గట్టి పోటీ నెలకొంది.

యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం యూపీలోని బుందేల్‌ఖండ్, పూర్వాంచల్, ఆగ్రా-లక్నో, గోరఖ్‌పూర్ నాలుగు ఎక్స్‌ప్రెస్‌వేలలో ఈ-ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం టెండర్లు పిలవటంతో పెద్ద పోటీ నెలకొంది. ఈ ప్రాజెక్టు కోసం నోడల్ ఏజెన్సీ యూపీ ఎక్స్‌ప్రెస్‌వే ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ(UPEIDA) ఈ ప్రాజెక్ట్‌లలో 26 ఈ-చార్జింగ్ స్టేషన్ల నెట్‌వర్క్‌ను నిర్మించడానికి ప్రైవేట్ కంపెనీల నుంచి బిడ్‌లను ఆహ్వానించింది.
ప్రాజెక్టును చేజిక్కించుకోవటం కోసం ప్రయత్నిస్తున్న కంపెనీల జాబితాలో రిలయన్స్, అదానీ-టోటల్ ఎనర్జీ, జీఎంఆర్ ఎనర్జీ, బీఎలెక్ట్రిక్, లైట్‌జిప్ టెక్నాలజీస్, ఈవీ ప్లెక్సస్, సీమెన్స్ వంటి కంపెనీలు ఉన్నాయి.ప్రతిపాదిత ఈ-ఛార్జింగ్ స్టేషన్‌లలో ప్రజా సౌకర్యాలు, వెండింగ్ జోన్‌లు కూడా ఉంటాయి. బిడ్డర్‌కు ప్రభుత్వం 10 ఏళ్ల కాలానికి లీజుపై భూమిని అందిస్తోంది.
5 ఏళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి 5% ఆదాయం వస్తుందని, భూమి కేటాయించిన 6 నెలల్లోగా కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించాల్సి ఉంటుందని అధికారి తెలిపారు. 2030 నాటికి ఈ-మెుబిలిటీ సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే ఈవీలను ప్రమోట్ చేసేందుకు అవసరమైన పర్యావరణ వ్యవస్థను వేగవంతం చేసేందుకు ప్లాన్ చేస్తోంది.


Click it and Unblock the Notifications