Adani Cements: అసలే అదానీ కొండంత కష్టాల్లో కూరుకుపోయాడు. ప్రపంచ కుబేరుడు సంపదను పోగొట్టుకుని తన స్థానాన్ని కోల్పోయాడు. దీనికి తోడు దేశంలో వ్యవహారం రాజకీయ అస్త్రంగా మారటంతో గౌతమ్ అదానీ అన్నివైపుల నుంచి ఒక్కసారిగా చుట్టుముట్టబడ్డారు. ఇలాంటి తరుణంలో గ్రూప్ తీసుకున్న నిర్ణయం ఇన్వెస్టర్లలో ఉత్తేజాన్ని నింపుతోంది.

అదానీ సిమెంట్స్..
అనేక రంగాల్లో వ్యాపారాలను నిర్వహిస్తున్న అదానీ ఇటీవల భారీ మెుత్తానికి ఏసీసీ, అంబుజా సిమెంట్ కంపెనీలను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని కారణాల వల్ల కంపెనీలను కొన్ని రోజుల వ్యవధిలోనే హిమాచల్ ప్రాంతంలోని ఉత్పత్తి ప్లాంట్ ను తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే ఈ క్రమంలో నేటి నుంచి గగల్, దార్లాఘాట్ ప్లాంట్‌లలో కార్యకలాపాలను తిరిగి ప్రారంభిస్తాయని కంపెనీ వెల్లడించింది.

ఉత్పత్తి ఎందుకు ఆగింది..?
సరకు రవాణా ఛార్జీల విషయంలో కంపెనీకి ట్రక్కు యూనియన్లకు మధ్య వివాదం తలెత్తింది. దీంతో బర్మానాలోని ఏసీసీ సిమెంట్ ప్లాంట్, దార్లఘాట్‌లోని అంబుజా సిమెంట్ ప్లాంట్లలో ఉత్పత్తి నిలిచిపోయింది. ఈ రెండు ప్లాంట్లు డిసెంబరులో మూసివేయబడ్డాయి. దీనిపై ACC & అంబుజా సిమెంట్స్ CEO అజయ్ కపూర్ హిమాచల్ ప్రదేశ్ అధికారులకు రాసిన లేఖ రాశారు. ఏడాదికి 50,000 కిలోమీటర్లు నడిపేందుకు యూనియన్లు ఒప్పుకోవాలని, వాహనాల సంఖ్యను 550కు తగ్గించి కిలోమీటరుకు ఫిక్స్ డ్ ఖర్చులను తగ్గించాలని కంపెనీ అప్పట్లో నిర్ణయించింది.

వివాదం పరిష్కారం..
పలు దఫాలుగా రవాణా చేసే ట్రక్కు యజమానులతో కంపెనీ ప్రతినిధుల చర్చల తర్వాత మొత్తం సరకు రవాణా రేట్లలో 10-12% తగ్గింపుకు పార్టీలు అంగీకరించాయని అదానీ గ్రూప్ వెల్లడించింది. దార్లాఘాట్ ప్లాంట్ నుంచి 12 టన్నుల సింగిల్ యాక్సిల్ ట్రక్కులకు కొత్త సరుకు రవాణా ధరలు కిలోమీటరుకు టన్నుకు రూ. 10.30గా నిర్ణయించారు. మల్టీ-యాక్సిల్ 24 టన్ను ట్రక్కుల కొత్త రేట్లు రెండు యూనిట్లకు కిలోమీటరుకు టన్నుకు రూ. 9.3గా ఉంటాయి.

లాభపడుతున్న షేర్స్..
ఈ వార్తల నేపథ్యంలో అంబుజా సిమెంట్స్, ఏసీసీ సిమెంట్ కంపెనీల షేర్లు నేడు స్టాక్ మార్కెట్లో లాభాలతో తమ ప్రయాణాన్ని ప్రారంభించాయి. అంబుజా సిమెంట్ స్టాక్ ఎన్ఎస్ఈ సూచీలో ఉదయం 9.18 గంటల సమయంలో 355.45 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇదే సమయంలో ఏసీసీ సిమెంట్ స్టాక్ సైతం స్వల్పంగా లాభపడి ఎన్ఎస్ఈలో రూ.1,860 వద్ద ట్రేడ్ అవుతోంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications