CM Vijay: పార్టీ పెట్టిన రెండేళ్లలో అధికారంలోకి.. ఏదైనా ప్లాన్ ప్రకారం చేస్తే విజయం వరిస్తుంది..!

చాలా మంది ఏదైనా చేయాలనుకుంటారు. అనుకున్నవారిలో చాలా తక్కువ మంది పని మొదలు పెడతారు. మొదలు పెట్టిన వారిలో కొంత మంది మధ్యలోనే విడిచి పెడతారు. కానీ.. పట్టుదలగా పని చేసిన వాడు చరిత్ర సృష్టిస్తాడు. అది ఏ రంగంలోనైనా.. వ్యాపారంలో కావొచ్చు, సినీ రంగంలో కావొచ్చు. రాజకీయాల్లో కావొచ్చు. ఇలా పట్టువదలని విక్రమార్కుడిలా పని చేసిన హీరో విజయ్ పార్టీ పెట్టిన రెండేళ్లలోనే అధికారంలోకి వచ్చారు. ఆయన ఈ విజయం సాధించడానికి ఎంతో కృషి, పట్టుదల ఉంది.

ఒక విజన్ తో పార్టీ పెట్టిన విజయ్ పక్క ప్లాన్ తో ముందుకెళ్లాడు. ప్రజల నాడిని పట్టుకున్నాడు. వారికి ఏం కావాలో తెలుసుకున్నాడు. అవే తన పార్టీ మానిఫెస్టోలో పెట్టారు. ఫైనల్ గా విజయం సాధించి హీరో విజయ్ సీఎం విజయ్ గా మారారు. ఈ రోజు ఆయన పుట్టిన రోజు సందర్భంగా సినీ పరిశ్రమలోని ఆయన సహచరులు ఆయన గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. విజయ్ పట్టుదల, కృషిని కొనియాడారు.

జోసెఫ్ విజయ్ బాలనటుడిగా సినీ రంగ ప్రవేశం చేశారు. 30 సంవత్సరాలకు పైగా సాగిన కెరీర్ లో 69 సినిమాలు పూర్తి చేశారు.2024లో దర్శకుడు వెంకట్ ప్రభు, విజయ్ హీరోగా ద గోట్ సినిమా తీశారు. అప్పుడు విజయ్ కారుకు 'TN 07 CM 2026' అనే నంబర్ ప్లేట్‌ను అమర్చడం ద్వారా వెంకట్ ప్రభు ఆ సినిమాలో చూపించిన దృశ్యం నిజమైంది. విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి అయినప్పుడు, ఆ దర్శకుడు ఆ నంబర్ ప్లేట్‌ను ఆయనకు బహుమతిగా ఇచ్చారు. విజయం కష్టం ఫలించిందని చెప్పారు.

cm viay

ప్రపంచ చలనచిత్ర పరిశ్రమలో విజయ్ ఒక అద్భుతమైన శక్తి అని నిర్మాత జి. ధనంజయన్ అన్నారు. ఏ ఇతర స్టార్ కూడా రాజకీయ పార్టీని స్థాపించిన రెండేళ్లలో సీఎం కాలేదన్నారు. అయితే దీని వెనక విజయ్ కష్టం ఉందన్నారు. ప్లాన్ ప్రకారమే ముందుకు వెళ్లడం ద్వారా ఆయన విజయం సాధించారని గుర్తు చేశారు.

విజయ్ మాటల కంటే పరిశీలన, ఆచరణకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే వ్యక్తి అని తెలిపారు. ఆయన మాట్లాడటం కంటే వినడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తారని పేర్కొన్నారు. ఇది ఆయనలోని ఒక ప్రత్యేక లక్షణమన్నారు. విజయ్ దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టే ఈ స్థాయికి చేరుకున్నట్లు చెప్పారు. అయితే రాజకీయ రంగంలోనే కాదు.. వ్యాపార రంగంలోనూ దృఢమైన నిర్ణయం తీసుకోవాలి. అలా చేస్తేనే విజయం సాధించగలం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+