టాలీవుడ్ నటుడు మహేష్ బాబుకు చెందిన దుస్తుల బ్రాండ్ హంబుల్ అతిపెద్ద ఫ్యాషన్ పోర్టల్ మింత్రతో జత కట్టింది. ఆన్‌లైన్ కస్టమర్లను ఆకట్టుకునేందుకు దీంతో కలిసింది. ఈ రెండు సంస్థల మధ్య ఒప్పందం మేరకు ఇక నుంచి మింత్రలో హంబుల్ దుస్తులు లభిస్తాయి. హంబుల్ కోను మహేష్ బాబు గత ఏడాది లాంచ్ చేసిన విషయం తెలిసిందే.

మింత్రాతో హంబుల్ జత
మింత్రా ఫ్యాషన్ ఈ కామర్స్ కంపెనీ. ఇక, ది హంబుల్ కో మహేష్ బాబుకు చెందిన మెన్స్‌వేర్ బ్రాండ్. ఒప్పందం మేరకు హంబుల్ బ్రాండ్ కింద ఉన్న స్వెట్ షర్ట్స్, హుడీస్ షర్ట్స్, టీ షర్ట్స్, బాటమ్ వేర్ దుస్తులు మింత్రాలో అందుబాటులో ఉంటాయి. రూ.599 నుంచి ధర ప్రారంభమవుతుంది. దాదాపు 200 రకాల దస్తులు అందిస్తోంది.

దేశవ్యాప్తంగా హంబుల్ దుస్తులు
ఈ ఒప్పందం ద్వారా తమ బ్రాండ్ (హంబుల్) ఉత్పత్తులు దేశవ్యాప్తంగా కస్టమర్లకు అందుబాటులోకి వస్తాయని టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు తెలిపారు. తాము ఆరు నెలల క్రితం హంబుల్ కో బ్రాండ్‌ను ప్రారంభించినట్లు చెప్పారు.

మింత్రాలో దేశీయ, అంతర్జాతీయ దుస్తులు
మింత్రా జబాంగ్ హెడ్ నాగారం మాట్లాడతూ ఇప్పటికే పలు అంతర్జాతీయ బ్రాండ్స్‌ను తమ సంస్థ కొనుగోలుదారులకు అందిస్తోందని, ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో కస్టమర్లకు అందించేందుకు హంబుల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం మింత్రాలో దేశీయ, అంతర్జాతీయ బ్రాండ్ల దుస్తులు లభిస్తాయి.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications