Patel Engineering stock: దేశీయ స్టాక్ మార్కెట్లలో చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లతో పాటు కొత్తగా వస్తున్న యువ ట్రేడర్లు తరచుగా పెద్ద ఇన్వెస్టర్ల పోర్ట్ ఫోలియోలను ఫాలో అవుతుంటారని తెలిసిందే. గతంలో చాలా మంది దివంగత బిగ్ బుల్ రాకేష్ జున్‌జున్‌వాలా పెట్టుబడులపై ఓ కన్నేసి ఉంచేవారు. ప్రస్తుతం ఆయన భార్య రేఖాతో పాటు ఇతర ప్రముఖుల పెట్టుబడులను ట్రాక్ చేస్తున్నారు.
అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది దేశీయ ప్రముఖ పెట్టుబడిదారు విజయ్ కేడియా పోర్ట్ ఫోలియో స్టాక్ గురించే. గడచిన వారంలో దేశీయ స్టాక్ మార్కెట్లలో పటేల్ ఇంజినీరింగ్ లిమిటెడ్ కంపెనీ షేర్లు మంచి పెరుగుదలను చూడటంతో ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. ఈ వారం పటేల్ ఇంజనీరింగ్ ఒక ఒప్పందం గురించి స్టాక్ మార్కెట్ ఫైలింగ్స్‌లో వెల్లడించింది. నాన్-కోర్ ఆస్తులను ఆఫ్‌లోడ్ చేసే వ్యూహంలో భాగంగా వెల్‌స్పన్ మిచిగాన్ ఇంజనీర్స్ లిమిటెడ్‌లో మిగిలిన 9.99 శాతం ఈక్విటీ వాటాను రూ.100 కోట్లకు విక్రయించినట్లు కంపెనీ తెలిపింది.

డీల్ విజయవంతంగా పూర్తికావటంతో అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయం కంపెనీకి నగదు ప్రవాహాలకు గణనీయంగా పెంచటంలో దోహదపడుతుందని పటేల్ ఇంజనీరింగ్ వెల్లడించింది. కంపెనీ వ్యూహాత్మక ప్రాధాన్యతలకు మద్దతు ఇవ్వడానికి అదనపు ఆర్థిక బలాన్ని అందిస్తుందని పేర్కొంది. ఈ ఆదాయాన్ని ఉపయోగించడం వల్ల కంపెనీ బ్యాలెన్స్ షీట్ బలోపేతం అవుతుంది. కీలక రంగాల్లో వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టడం ద్వారా, కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచడం, ఆవిష్కరణలను నడపడం, మార్కెట్ ఉనికిని విస్తరించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ తెలిపింది. వెల్స్పన్ మిచిగాన్ ఇంజనీర్స్ లిమిటెడ్‌లో వాటాను వెల్స్పన్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ కొనుగోలు చేసిందని వెల్లడైంది.
అయితే సెప్టెంబర్ 2024లో ప్రముఖ ఇన్వెస్టర్ విజయ్ కేడియా పటేల్ ఇంజనీరింగ్ కంపెనీలో ఉన్న 1.20 కోట్ల షేర్లను విక్రయించినట్లు వెల్లడైంది. దీంతో కంపెనీలో ఆయనకు ఉన్న 1.42 శాతం వాటాలు చేతులు మారాయి. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం సెప్టెంబర్ 2024 నాటికి పటేల్ ఇంజనీరింగ్ ప్రమోటర్ల వాటాలో 88.7 శాతం తాకట్టులో ఉన్నాయి. జూన్ 30, 2024 నాటికి కంపెనీ సెగ్మెంట్ల వారీగా ఆర్డర్ బుక్ పరిశీలిస్తే.. జలవిద్యుత్ 61.53 శాతం, నీటిపారుదల 21.99 శాతం, సొరంగం 10.54 శాతం, రోడ్లు 2.45 శాతం, ఇతరాలు 3.49 శాతం ఉన్నాయి.

చైనా మార్కెట్లలో పెట్టుబడులు..
ప్రముఖ భారతీయ ఇన్వెస్టర్ విజయ్ కేడియా ప్రస్తుతం చైనా మార్కెట్లో తన పెట్టుబడులు పెడుతున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే తన మెుత్తం పెట్టుబడుల్లో 2-3 శాతం డబ్బును చైనా కంపెనీల షేర్ల కొనుగోలుకు కేటాయించినట్లు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మరింతగా వీటిని పెంచనున్నట్లు వెల్లడించారు. తాను చైనీస్ మార్కెట్లపై బులిష్ వ్యూ కలిగి ఉన్నానని రానున్న కాలంలో మంచి రాబడులను అందించాలని కోరుకుంటున్నట్లు సంవత్ 2081 రోజున ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇందుకోసం కొన్ని దేశీయ స్టాక్ పెట్టుబడులను విక్రయించినట్లు చెప్పారు. కేడియా వ్యక్తిగత చైనీస్ స్టాక్‌లలో పెట్టుబడి పెట్టలేదు కానీ బదులుగా చైనా ఆధారిత మ్యూచువల్ ఫండ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ద్వారా చైనీస్ షేర్ల బుట్టను కొనుగోలు చేశారు.
More From GoodReturns

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications