Multibagger Stock: 11.5 లక్షల షేర్లు కొన్న ప్రముఖ ఇన్వెస్టర్.. రాకెట్ లాగా పెరిగిన స్టాక్..
Multibagger Stock: గతంలో చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లు రాకేష్ జున్ జున్ వాలా లాంటి పెట్టుబడిదారులను ఫాలో అయ్యేవారు. వారు ఎలాంటి స్టాక్స్ కొంటున్నారు. ఏఏ రంగాల షేర్లను ఎంపిక చేసుకుంటున్నారు వంటి విషయాలను గమనించి తమ పెట్టుబడి నిర్ణయాలను తీసుకునేవారు.

ప్రముఖ ఇన్వెస్టర్..
ఈ రోజు ప్రముఖ ఇన్వెస్టర్ శంకర్ శర్మ BLS ఇంటర్నేషనల్ కంపెనీ షేర్లను కొనుగోలు చేశారు. ఈ కంపెనీలో ఆయన పెట్టుబడులు పెట్టడంతో మల్టీబ్యాగర్ స్టాక్ ఏకంగా 11 శాతం పెరిగింది. రాకెట్ వేగంతో ఎగిసిన ఈ స్టాక్ మార్కెట్లు ముగిసే సమయానికి రూ.28.70 పెరిగి రూ.319.90 వద్ద ముగిసింది. ఈ క్రమంలో స్టాక్ నేడు తన కొత్త 52 వారాల గరిష్ఠమైన రూ.326.65 స్థాయిని తాకింది.

లక్షల షేర్లు కొనుగోలు..
స్టాక్ మార్కెట్ వెటరన్ ఇన్వెస్టర్ శంకర్ శర్మ శుక్రవారం ఎన్‌ఎస్‌ఈ బల్క్ డేటా డీల్‌లో భాగంగా బిఎల్‌ఎస్ ఇంటర్నేషనల్ సర్వీసెస్‌లో వాటాను కొనుగోలు చేశారు. ఆయన కంపెనీలో 11.5 లక్షల షేర్లను కొనుగోలు చేశారు. ఈ క్రమంలో ఒక్కో షేర్ ను సగటున రూ.275 చొప్పున బల్క్ డీల్ ద్వారా కొనుగోలు చేసినట్లు వెల్లడైంది.

షేర్ చరిత్ర..
గత ఐదు ట్రేడింగ్ సెషన్లలో ఈ స్టాక్ 15.75% వరకు పెరిగింది. ఈ ఏడాది YTDలో కంపెనీ షేర్లు 240.18% వరకు రాబడిని ఇచ్చాయి. ఈ సమయంలో షేరు రూ.94.73 నుంచి రూ.323కి పెరిగింది. గత ఏడాది కాలంలో కంపెనీ షేర్లు 173.37% రాబడిని ఇచ్చింది ఈ మల్డీబ్యాగర్ స్టాక్.

కంపెనీ వ్యాపారం..
BLS ఇంటర్నేషనల్ సర్వీసెస్ ఒక మిడ్-క్యాప్ కంపెనీ. దీని మార్కెట్ క్యాప్ దాదాపు రూ.5,957.92 కోట్లుగా ఉంది. BLS ఇంటర్నేషనల్ భారతదేశంలోని ఆన్‌లైన్ వీసా దరఖాస్తు కేంద్రం. వీసా, పాస్‌పోర్ట్, కాన్సులర్, ఈ-గవర్నెన్స్, వెరిఫికేషన్, బయోమెట్రిక్, రిటైల్ సర్వీసెస్‌లో 17 ఏళ్లకు పైగా నైపుణ్యాన్ని కలిగి ఉంది. ఫోర్బ్స్ ఆసియాచే "బెస్ట్ అండర్ ఎ బిలియన్ కంపెనీ"గా కంపెనీ ఎంపిక చేయబడింది.


Click it and Unblock the Notifications