Rakesh Jhunjhunwala: స్టాక్ మార్కెట్ ప్రముఖ ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలా పోర్ట్‌ఫోలియో జూలైలో రెండంకెల వృద్ధిని సాధించింది. ఏప్రిల్-జూన్ మధ్య మార్కెట్లు ఎక్కువగా ఓలటాలిటీని ఎదుర్కొన్నప్పటికీ.. బిగ్ బుల్ పోర్ట్‌ఫోలియోలో కొంత గుర్తించదగిన రికవరీని నమోదైంది. ఆయన పెట్టుబడి పెట్టిన మెజారిటీ స్టాక్‌లు జూలైలో గణనీయమైన లాభాలను ఆర్జించాయి. ప్రస్తుతం జున్‌జున్‌వాలా బ్యాంకింగ్, ఆటోమొబైల్, ఇన్సూరెన్స్, మెటల్స్, ఫార్మా, గేమింగ్ వంటి వివిధ విభాగాల్లో మెుత్తం 32 కంపెనీల స్టాక్స్ లో పెట్టుబడులను కలిగి ఉన్నారు.

జూలైలో అదరకొట్టిన లాభాలు..
జూలై మాసం జున్‌జున్‌వాలాకు బాగా కలిసొచ్చింది. ఈ నెలలో ఆయన పోర్ట్‌ఫోలియో సంపద 20% మేర పెరగటంతో రూ.5,188.55 కోట్ల మేర పెరిగింది. ఈ పెరుగుదల తరువాత జూలై చివరి నాటికి బిగ్ బుల్ సంపద రూ.30,614.43 కోట్లుగా ఉంది. అంతకు ముందు పెట్టుబడుల విలువ ఏప్రిల్ - జూన్ 2022 త్రైమాసికం రూ.25,425.88 కోట్లు, జనవరి - మార్చి 2022 త్రైమాసికంలో రూ.33,753.92 కోట్లుగా ఉంది.

టాప్ పెర్ఫార్మింగ్ స్టాక్స్..
ప్రస్తుతం రాకేష్ జున్‌జున్‌వాలా పోర్ట్‌ఫోలియో లాభాలను పరిశీలిస్తే.. గడచిన నెలలో స్టార్ హెల్త్ స్టాక్ మంచి పనితీరును కనబరిచింది. ఈ క్రమంలో స్టాక్ ఏకంగా 50 శాతాని కంటే ఎక్కువ పెరిగింది. ఆ తరువాతి స్థానంలో అనంత్ రాజ్ 39%, కరూర్ వైశ్యా బ్యాంక్ 31%, ఆటోలైన్ ఇండస్ట్రీస్ 24%, టైటాన్ కంపెనీ 21.5% మేర రాబడిని అందించాయి.

టాప్-5 కంపెనీల్లో పెట్టుబడులు..
జున్‌జున్‌వాలా తాజా పెట్టుబడి వివరాలను గమనించినట్లయితే.. అందులో ప్రధానంగా స్టార్ హెల్త్, టైటాన్ అత్యంత విలువైన షేర్లుగా కొనసాగుతున్నాయి. టైటాన్‌లో రూ.10,549.2 కోట్లు, స్టార్ హెల్త్‌లో రూ.7,528.3 కోట్లు, మెట్రో బ్రాండ్‌లలో రూ.2,504.9 కోట్లు, టాటా మోటార్స్‌లో రూ.1,629.8 కోట్లు, క్రిసిల్‌లో రూ.1,250.9 కోట్ల విలువైన పెట్టుబడులు ఉన్నాయి. ఈ 5 కంపెనీలు పోర్ట్‌ఫోలియోలో మెుదటి అత్యంత విలువైన స్టాక్స్ అని చెప్పుకోవాలి.

బిగ్ బుల్ ఇన్వెస్ట్ మెంట్స్ వీటిలోనే..
టాప్-5 పెట్టుబడుల తరువాత రాకేష్ జున్‌జున్‌వాలా పెట్టుబడులు.. ఫోర్టిస్ హెల్త్‌కేర్, ఫెడరల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఇండియన్ హోటల్స్, ఎన్‌సీసీ, రాలిస్ ఇండియా, జూబిలెంట్ ఇంగ్రేవియా, జూబిలెంట్ ఫార్మోవా, నజారా టెక్నాలజీస్, టాటా కమ్యూనికేషన్స్, ఎస్కార్ట్స్ కుబోటా, ఆప్టెక్, కరూర్ వైశ్యా బ్యాంక్, ఆగ్రో టెక్ ఫుడ్స్, జియోజిత్ సర్వీస్, ఫినాన్‌సివెల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, అనంత్ రాజ్, వోకార్డ్ట్, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, మ్యాన్ ఇన్‌ఫ్రా, DB రియాల్టీ, ఓరియంట్ సిమెంట్, ఆటోలైన్ ఇండస్ట్రీస్, బిల్‌కేర్, ప్రోజోన్ ఇంటు ప్రాపర్టీస్ కంపెనీల్లో ఉన్నాయి.

ఈ కంపెనీ షేర్లు మరింత పెరగొచ్చు..
నిపుణుల అంచనాల ప్రకారం రానున్న కాలంలో జున్‌జున్‌వాలా కలిగి ఉన్న స్టాక్స్ లో కొన్ని మంచి పనితీరు కనబరుస్తాయని ఆశాజనకంగా ఉన్నారు. వీటిలో టైటాన్ కంపెనీ, టాటా మోటార్స్, కరూర్ వైశ్యా బ్యాంక్, కెనరా బ్యాంక్, కెనరా బ్యాంక్ షేర్లు ఉన్నాయి. అయితే ఈ స్టాక్స్ ఫండమెంటల్స్, లాభాలు, పనితీరుపై నిపుణుల అంచనాలు పాజిటివ్ గా ఉన్నాయి.
More From GoodReturns

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..



Click it and Unblock the Notifications