Rakesh Jhunjhunwala: హర్షద్ మెహతా పతనం తర్వాత మార్కెట్లకు బిగ్ బుల్ గా మారారు రాకేష్ జున్‌జున్‌వాలా. ఆయన ఎందులో పెట్టుబడులు పెడుతున్నారో తెలుసుకోవాలని చాలా మందికి మక్కువ. అయితే ఇటీవల ఆయన మరణించినప్పటికీ ఆయన పెట్టుబడుల పోర్ట్ ఫోలియోను అనేక మంది ఫాలో అవుతూనే ఉన్నారు. తాజాగా ఆయన ఇన్వెస్ట్ మెంట్స్ విలువ ఏకంగా రూ.35,000 కోట్లను దాటేసింది. జూన్ త్రైమాసికంలో అది రూ.33,225గా ఉంది.

ఇండియన్ వారెన్ బఫెట్..
స్టాక్ మార్కెట్ ప్రపంచంలో ఇండియన్ వారెన్ బఫెట్ గా రాకేష్ జున్‌జున్‌వాలాను భావిస్తారు. ఆయనకు అత్యంత ఇష్టమైనవాటిలో టైటాన్ కంపెనీ షేర్లు ఒకటి. ఇందులో ఆయన వాటాలు 5.05% నుంచి 5.54%కి పెరిగాయి. వీటి విలువ రూ.13,388 కోట్లుగా ఉంది. దీనికి తోడు సెప్టెంబర్ 30 నాటికి స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ హోల్డింగ్ రూ.7,056.80 కోట్లుకు చేరుకున్నాయి.

మూడో స్థానంలో..
రాకేష్ జున్‌జున్‌వాలా పోర్ట్‌ఫోలియోలో మూడవ అతిపెద్ద హోల్డింగ్ టాటా మోటార్స్ ఉంది. దీనికి తోడు గ్రిజిల్, ఇండియన్ హోటల్స్ పెట్టుబడుల జాబితాలో ఉన్నాయి. అలా రాకేష్ భారత స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన 30 వివిధ కంపెనీల్లో పెట్టుబడులను కలిగి ఉన్నారు. టాటా మోటార్స్ శరవేగంగా ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో దూసుకుపోవటం, తాజాగా విడుదల చేసిన ఫలితాల్లో నష్టాలు తగ్గటం కంపెనీ భవిష్యత్తు ప్రయాణంపై సానుకూలంగా ప్రతిబింబిస్తుందని తెలుస్తోంది.

ఇతర కంపెనీల్లో పెట్టుబడులు..
జున్‌జున్‌వాలాకు సింగర్ ఇండియా కంపెనీలో వాటాలు ఉన్నాయి. తాజాగా సెప్టెంబర్ త్రైమాసికంలో 42,50,000 షేర్లు జోడించబడటంతో పెట్టుబడి విలువ రూ.30 కోట్లకు చేరుకుంది. దీనికి తోడు టాటా కమ్యూనికేషన్స్, ఫోర్టిస్ హెల్త్ కేర్ లలో సైతం బిగ్ బుల్ పెట్టుబడులు ఉన్నాయి

పెట్టుబడి తగ్గించుకున్న కంపెనీలు..
సెప్టెంబర్ త్రైమాసికంలో వివరాల ప్రకారం జూబ్లీ ఇంగ్రేవియా, ఫెడరల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, డిబి రియాల్టీ, రాలిస్ ఇండియా కంపెనీల షేర్లలో రాకేష్ పెట్టుబడులు తగ్గాయి. కాగా.. ఆప్‌టెక్, జూబిలెంట్ ఫార్మా, ప్రోజోన్ ఇందూ ప్రాపర్టీస్, రాలిస్ ఇండియా, డిష్‌మాన్ కార్బోజెన్ కంపెనీల పెట్టుబడుల్లో ఎలాంటి మార్పులు జరగలేదని తెలుస్తోంది. కొన్ని కంపెనీల్లో షేర్ల విక్రయం ద్వారా లాభాలను స్వీకరించటమే షేర్ల విక్రయానికి కారణమని తెలుస్తోంది.

మెుత్తం పెట్టుబడులు..
రాకేష్ మరణించిన తర్వాత ఆయన భార్య రేఖా జున్‌జున్‌వాలా పెట్టుబడుల నిర్వహణను కొనసాగిస్తున్నారు. అయితే దివంగత బిగ్ బుల్ పోర్ట్‌ఫోలియో విలువ ఇప్పుడు రూ.35,000 కోట్లను దాటింది. రాకేష్ జున్‌జున్‌వాలా పెట్టుబడుల పూర్తి వివరాలు తెలుసుకునేందుకు Rakesh Jhunjhunwala and Associates's portfolio లింక్ క్లిక్ చేయండి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!



Click it and Unblock the Notifications