Radhakishan Damani: ఈ లిక్కర్ స్టాక్ లో దమానీ కొత్త కొనుగోళ్లు.. ఇన్వెస్టర్లకు కిక్కిచ్చే వార్త ..

Radhakishan Damani portfolio: కారణం లేకుండా పెద్ద ఇన్వెస్టర్లు ఏ కంపెనీల్లోనూ పెట్టుబడులు పెట్టరనేది మార్కెట్ నానుడి. తాజాగా.. బిలియనీర్ ఇన్వెస్టర్, DMart రిటైల్ చైన్ యజమాని రాధాకిషన్ దమానీ వ్యాపార సంస్థ జూన్ 2022 త్రైమాసికంలో ఒక లిక్కర్ కంపెనీలో పెట్టుబడులను పెంచింది. ఇందులో భాగంగా మరో 56 వేల షేర్లను కొనుగోలు చేసినట్లు వెల్లడైంది.

లిక్కర్ కంపెనీలో కొనుగోళ్లు..

లిక్కర్ కంపెనీలో కొనుగోళ్లు..

రాధాకిషన్ దమానీ కుటుంబంతో సహా బోర్డు సభ్యులడిగా ఉన్న డెరైవ్ ట్రేడింగ్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ సంస్థ.. తాజాగా యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్‌లో అదనంగా 56,544 ఈక్విటీ షేర్లు లేదా 0.02 శాతం వాటాలను కొనుగోలు చేసింది. ప్రస్తుత కొనుగోలు తరువాత కంపెనీలో హోల్డింగ్ 1.23 శాతం లేదా 32,52,378 షేర్లకు చేరుకుంది. అంతకుముందు మార్చి 2022 త్రైమాసికంలో దమానీ ట్రేడింగ్ కంపెనీ 31,95,834 ఈక్విటీ షేర్లను కలిగి ఉంది.

పోర్ట్‌ఫోలియోలో చేసిన మార్పులు..

పోర్ట్‌ఫోలియోలో చేసిన మార్పులు..

ప్రఖ్యాత ఇన్వెస్టర్ రాధాకిషన్ దమానీ తన పోర్ట్‌ఫోలియోలో ఎటువంటి గణనీయమైన మార్పులు చేయలేదు. కేవలం యునైటెడ్ బ్రూవరీస్ అదనపు షేర్లను కొనుగోలు చేశారు. ఇదే సమయంలో మెట్రోపోలిస్ హెల్త్‌కేర్, అవెన్యూ సూపర్‌మార్ట్‌లలో కొన్ని షేర్లను విక్రయించారు.

14 స్టాక్ లలో పెట్టుబడులు..

14 స్టాక్ లలో పెట్టుబడులు..

జూలై 25, 2022 నాటికి రాధాకిషన్ దమానీ రూ.1,63,395.2 కోట్ల కంటే ఎక్కువ నికర విలువతో 14 స్టాక్‌లను తన పోర్ట్‌ఫోలియోలో కలిగి ఉన్నారు. అవెన్యూ సూపర్‌మార్ట్‌తో పాటు VST ఇండస్ట్రీస్, ఇండియా సిమెంట్స్ ఆయన పోర్ట్‌ఫోలియో జాబితాలో అత్యధికంగా పెట్టుబడిని కలిగి ఉన్న స్టాక్స్.

యునైటెడ్ బ్రూవరీస్ షేర్ వివరాలు..

యునైటెడ్ బ్రూవరీస్ షేర్ వివరాలు..

యునైటెడ్ బ్రూవరీస్ లిక్కర్ తయారీ ప్రధాన వ్యాపారంగా కలిగి ఉంది. కంపెనీ కింగ్‌ఫిషర్ బ్రాండ్ క్రింద బీర్‌ను మార్కెట్ చేస్తోంది. దీనికి తోడు ఇతర ఆల్కహాలిక్ పానీయాలకు చెందిన అనేక ఇతర బ్రాండ్‌లను కలిగి ఉంది. ఈ స్టాక్ 52 వారాల గరిష్థ ధర రూ.1,793.65గా ఉండగా.. 52 వారాల కనిష్ఠ ధర రూ.1,274.60గా ఉంది. అయితే ఈ స్టాక్ ప్రస్తుత ధర మధ్యాహ్నం 3.20 గంటలకు రూ.1677.05 వద్ద ట్రేడ్ అవుతోంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+