Solar Multibagger: ఈ కంపెనీలో 2 లక్షల షేర్లు కొన్న వెటరన్ ఇన్వెస్టర్.. భారీగా లాభాలు..
Investment: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ వినియోగం తారా స్థాయికి చేరుతోంది. ఇదే క్రమంలో అనేక దేశాలు శిలాజ ఇంధనాల నుంచి రెన్యూవబుల్ ఎనర్జీ వైపు తమ ప్రయాణాన్ని మార్చాయి. ఈ క్రమంలో కొన్ని కంపెనీల షేర్లు దిగ్గజ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నాయి.
సోలార్ ఇండస్ట్రీకి చెందిన జెన్సోల్ ఇంజినీరింగ్ కంపెనీ షేర్లు భారీగా పెరిగి ఇన్వెస్టర్లను ధనవంతులుగా మార్చాయి. గడచిన రెండేళ్ల కాలాన్ని పరిశీలిస్తే.. స్టాక్ ధర రూ.19 నుంచి రూ.750కి పెరిగాయి. ఈ క్రమంలో జెన్సోల్ స్టాక్ 3900 శాతం కంటే ఎక్కువ రాబడిని ఇన్వెస్టర్లకు అందించింది. ఈ కంపెనీ షేర్లపై ప్రముఖ ఇన్వెస్టర్ ముకుల్ అగర్వాల్ కూడా భారీగా పెందెం వేస్తూ ఏకంగా 2 లక్షల షేర్లను కొనుగోలు చేశారు.

ఎవరైనా ఇన్వెస్టర్ రెండేళ్ల కిందట రూ.లక్ష పెట్టుబడిగా పెట్టినట్లయితే రూ.40.45 లక్షలుగా మార్చేసింది. డిసెంబర్ 22, 2021న జెన్సోల్ ఇంజినీరింగ్ షేర్ ధర రూ.19.67 వద్ద ఉంది. అయితే తాజాగా నవంబర్ 17, 2023న ఒక్కో షేరు ధర రూ.795.80కి చేరుకుంది. అంటే ఈ కాలంలో ఇన్వెస్టర్లు ఏకంగా 3945% రాబడిని అందుకున్నారు. దీంతో దీర్ఘకాలం పాటు కంపెనీలో తమ పెట్టుబడులను కొనసాగించిన పెట్టుబడిదారుల సంపద అనేక రెట్లు పెరిగింది.
ప్రముఖ ఇన్వెస్టర్ ముకుల్ అగర్వాల్ కంపెనీలో 1.64% వాటాను కలిగి ఉన్నారు. సెప్టెంబర్ త్రైమాసికంలో జెన్‌సోల్ ఇంజనీరింగ్ షేర్ హోల్డింగ్ పరిశీలిస్తే ఆయన 2 లక్షల షేర్లను కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. దీనికి ముందు జూన్ త్రైమాసికంలో ఇన్వెస్టర్ల జాబితాలో ఆయన పేరు లేదు. అంటే సెప్టెంబర్ త్రైమాసికంలోనే ప్రముఖ పెట్టుబడిదారు ముకుల్ అగర్వాల్ జెన్సోల్ ఇంజినీరింగ్‌పై పందెం కాశారు. పైగా కంపెనీ ఇటీవల తన పెట్టుబడిదారులకు 2:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను ఇన్వెస్టర్లకు అందించింది.


Click it and Unblock the Notifications