Multibagger Stock: దేశీయ స్టాక్ మార్కెట్లలో ప్రఖ్యాత ఇన్వెస్టర్ ఆశిష్ కచోలియా ఇన్వెస్ట్ చేసిన స్టాక్ ఇన్వెస్టర్లపై కాసుల పంట కురిపిస్తోంది. స్మాల్ క్యాప్ క్యాటగిరీకి చెందిన షేర్ తన ఇన్వెస్టర్లను ధనవంతులుగా మార్చేసింది.
ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది Faze Three కంపెనీ షేర్ల గురించే. గడచిన పదేళ్ల కాలంలో ఇన్వెస్టర్లకు భారీ రాబడిని అందించింది. ఈ క్రమంలో షేర్ ధర 5,700 శాతం మేర పెరిగింది. ఎవరైనా పెట్టుబడిదారుడు 10 ఏళ్ల కిందట కంపెనీ షేర్లలో రూ.లక్ష ఇన్వెస్ట్ చేసి ఇప్పటి వరకు కొనసాగించి ఉంటే దాని విలువ రూ.60 లక్షలకు చేరుకుని ఉండేది.

కంపెనీ షేర్లలో 56.16% వాటాలను ప్రమోటర్లు కలిగి ఉన్నారు. మే నెలలో దేశీయ ఫండ్ హౌస్‌లు ఎంచుకున్న వాటిలో ఫేజ్ త్రీ ఒకటి. మార్చి త్రైమాసికం నాటికి దేశీయ ప్రఖ్యాత ఇన్వెస్టర్ ఆశిష్ కచోయిలా కంపెనీలో దాదాపు 5.23% వాటాను కలిగి ఉన్నారు. FY23లో కంపెనీ అమ్మకాలు రూ.558 కోట్లుగా నమోదయ్యాయి. ఈ క్రమంలో నికర లాభం రూ.58 కోట్లుగా నమోదైంది. నాలుగో త్రైమాసికంలో రూ.14.83 కోట్లుగా ఉంది.
మూడేళ్ల కాలంలో కంపెనీ షేర్ 1103 శాతం రాబడిని అందించింది. అలాగే ఐదేళ్ల కాలంలో 302 శాతం రాబడిని ఇచ్చింది. రూ.933 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగిన ఫేజ్ త్రీ హోమ్ ఇంటీరియర్ ఉత్పత్తులను తయారు చేసి ఎగుమతి చేస్తుంది. కంపెనీ ఉత్పత్తుల్లో విస్తృత శ్రేణి బెడ్‌స్ప్రెడ్‌లు, డెకరేటివ్ కుషన్‌లు, టేబుల్‌టాప్‌లు, బాత్‌మ్యాట్‌లు, టఫ్టెడ్ కార్పెట్‌లు వంటి ఉత్పత్తులను తయారు చేస్తోంది.
ఈరోజు మధ్యాహ్నం 1.45 గంటల సమయంలో కంపెనీ షేర్ ధర ఎన్ఎస్ఈలో రూ.408.05 వద్ద కొనసాగుతోంది. కంపెనీ షేర్ 52 వారాల కనిష్ఠ ధర రూ.247.80గా ఉండగా.. 52 వారాల గరిష్ఠ ధర రూ.425గా ఉంది. బ్రోకరేజ్ సంస్థ అరిహంత్ క్యాపిటల్‌లోని సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ మిలీన్ వాసుదేయో అంచనాల ప్రకారం షేర్ ధర భవిష్యత్తులో రూ.436-475 స్థాయికి చేరుకుంటుందని టార్గెట్ ధరను వెల్లడించారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications