Gold Price: బంగారం తొందరపడి కొనుగోలు చేస్తున్నారా.. అయితే నష్టపోతారు..!

చాలా మంది బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయా అని ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే గత రెండేళ్లుగా బంగారం ధర భారీగా పెరిగింది. ఒక స్థాయిలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,70,000 లకు పైగా పెరిగింది. ఆ తర్వాత క్రమంగా తగ్గి.. తులం రూ.1,40,000 నుంచి రూ. 1,50, 000 మధ్య ట్రేడవుతోంది. పసిడి ధర ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతోంది. గత ఆరు నెలలుగా పుత్తడిలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. అయితే బంగారంలో ఈ స్థాయిలో పెరగడానికి పలు కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వివిధ దేశాలు సెంట్రల్ బ్యాంకులు భారీగా పసిడి కొనుగోలు చేశాయి.

ఇక చైనా సెంట్రల్ బ్యాంక్ అయితే బంగారాన్ని కొనుగోలు చేస్తూనే ఉంది. అంతే కాకుండా అమెరికా ఫెడ్ నిర్ణయాలు కూడా పసిడి ధరలు పెరగడానికి కారణమయ్యాయి. ఇక దేశీయంగా బంగారానికి భారీగా డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా పెళ్లిల సీజన్ లో పసిడిని భారీగా కొనుగోలు చేస్తున్నారు. అంతే కాకుండా ఇంకా బంగారం ధరలు పెరుగుతాయని భావిస్తున్న కొందరు బంగారంపై పెట్టుబడి పెడుతున్నారు. దీంతో డిమాండ్ పెరగడం వల్ల బంగారం ధర దిగి రావడం లేదు. అయితే బంగారం ధర ఇప్పటికీ ఎక్కువగానే ఉందని నిపుణులు భావిస్తున్నారు.

Gold

అయితే త్వరలోనే బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. బంగారం ధరలపై అత్యధిక ప్రభావం చూపుతున్న అంశాలను వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వివరించింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ. యూఎస్ డాలర్ విలువ పెరగడం, ప్రభుత్వ బాండ్లపై వడ్డీ రాబడులు అధికంగా ఉండటం వల్ల పెట్టుబడిదారులు బంగారం కంటే బాండ్లలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారని అంచనా వేసింది. దీంతో బంగారానికి డిమాండ్ తగ్గి, ధరలు కూడా తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. అయితే మరికొన్ని రీసెర్చ్ నివేదికలు బంగారం ధర పెరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి.

ఒక వేళ బంగారం ధర తగ్గినా భారీగా తగ్గే అవకాశం లేదని చెబుతున్నారు. పసిడి ధరలు 10 శాతం నుంచి 15 శాతం వరకు తగ్గితే తగ్గొచ్చని.. తప్పనిసరైతే కాదని పేర్కొంటున్నారు. మంగళవారం బంగారు ధరలు తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ 750 తగ్గి రూ.1,44,170 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.1,550 తగ్గి రూ.1,32,150 పలుకుతోంది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+