December Bank Holidays: డిసెంబర్‎లో 16 రోజులు బ్యాంకులు బంద్..!

ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థలో బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అందుకే బ్యాంకులు రాణిస్తున్నాయి. అయితే బ్యాంకుల్లో కూడా చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా యూపీఐ రాకతో బ్యాంకులు, ఏటీఎంలకు వెళ్లే వారి సంఖ్య తగ్గింది. అయినప్పటికీ కొన్ని పనులకు బ్యాంకులకు వెళ్లాల్సిందే. అకౌంట్ ఓపెనింగ్ కావొచ్చు, భారీగా డబ్బులు జమ చేయడం కావొచ్చు. చెక్ డ్రా చేయడానికి బ్యాంకులకు వెళ్లాల్సి ఉంటుంది. అందుకే బ్యాంకులో పని ఉన్నవారు బ్యాంకుల సెలవుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. డిసెంబర్ లో కూడా బ్యాంకులు పలు తేదీల్లో బ్యాంకులు మూసివేయనున్నారు. డిసెంబర్ 3న గురువారం దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్ కానున్నాయి. ఐడీబీఐ బ్యాంకును ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ సమ్మెకు బ్యాంకుల యూనియన్ పిలుపునిచ్చింది.

డిసెంబర్ లో 16 రోజుల పాటు బ్యాంకులు పని చేయవు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యాలెండర్ ప్రకారం ఆదివారాలు, రెండో శనివారం, నాల్గో శనివారం బ్యాంకులు బంద్ కానున్నాయి. అంతే కాకుండా డిసెంబర్ లో క్రిస్మస్ తో పాటు వివిధ పండుగల సందర్భంగా బ్యాంకులు మూసివేయనున్నారు. డిసెంబర్ చివరలో బ్యాంకులు వరుసగా మూడు రోజులు బంద్ కానున్నాయి. డిసెంబర్ 25 క్రిస్మస్ ఉండగా.. డిసెంబర్ 26న నాలుగో శనివారం, డిసెంబర్ 27న ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులకు వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. మేఘాలయ, సిక్కిం రాష్ట్రాల్లో వరుసగా నాలుగు రోజులు సెలవులు ఉండనున్నాయి.

Bank Holidays

డిసెంబర్ 1న స్వదేశీ విశ్వాస దినోత్సవం/రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ బ్యాంకులకు సెలవు ఉండనుంది. డిసెంబర్ 3న సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ విందు కారణంగా గోవాలో బ్యాంకులకు హాలి డే ఉంటుంది. డిసెంబర్ 6న ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా సెలవు ఉండనుంది. డిసెంబర్ 9,10, 11 తేదీల్లో సిక్కింలో బ్యాంకులకు సెలవు ఉంటుంది. డిసెంబర్ 12న రెండో శనివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేయనున్నారు. డిసెంబర్ 13 ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్ కానునున్నాయి.

డిసెంబర్ 18న మేఘాలయలో బ్యాంకులకు సెలవు ఉండనుంది. డిసెంబర్ 19న గోవా లిబరేషన్ డే సందర్భంగా బ్యాంకు సెలవు ఉంటుంది. డిసెంబర్ 20న ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేయనున్నారు. డిసెంబర్ 24న క్రిస్మస్ ఇవ్ సందర్భంగా మిజోరాం, నాగాలాండ్, మేఘాలయలో బ్యాంకులకు హాలిడే ఉంటుంది. డిసెంబర్ 25 క్రిస్మస్ సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉండనుంది. డిసెంబర్ 26 నాలుగో శనివారం, డిసెంబర్ 27 ఆదివారం కూడా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేయనున్నారు. డిసెంబర్ 30న మేఘాలయలో బ్యాంకులకు హాలీడే ఉంటుంది.

డిసెంబర్ 3న గురువారం దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్ కానున్నాయి. ఐడీబీఐ బ్యాంకును ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ సమ్మెకు బ్యాంకుల యూనియన్ పిలుపునిచ్చింది. AIBEA,AIBOA, BEFI బ్యానర్ కింద అన్ని బ్యాంకుల ఉద్యోగులు, అధికారులు ఈ నిరసనల్లో పాల్గొననున్నట్లు ప్రకటించింది. బ్యాంకును విదేశీ పెట్టుబడిదారునికి విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ AIBEA, AIBOA, BEFI ఉద్యోగ సంఘాలు నిరసనలు పిలుపునిచ్చాయి.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+