Bank Holidays: అక్టోబర్‎లో 16 రోజులు మూతపడనున్న బ్యాంకులు..!

దేశంలో అతి పెద్ద పండుగ అయిన దసరా అక్టోబర్ లోనే రాబోతోంది. అక్టోబర్ 10 నుంచి 22 వరకు తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ, దసరా సెలవులు ప్రకటించింది. ఇక అక్టోబర్ లో బ్యాంకులకు కూడా భారీగానే సెలవులు రానున్నాయి. వచ్చే నెలలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు గరిష్టంగా 10 రోజుల పాటు మూతపడనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అధికారిక సెలవుల క్యాలెండర్ ప్రకారం, స్థానిక పండుగలు బట్టి రాష్ట్రాల వారీగా బ్యాంక్ సెలవులు మారుతూ ఉంటాయి. అదనంగా ప్రతి నెలా ఆదివారాలు, రెండవ శనివారం, నాల్గవ శనివారాల్లో దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేస్తారు.

మొత్తంగా అక్టోబర్ లో 16 రోజుల పాటు బ్యాంకులు మూసివేయనున్నారు. 16 రోజుల సెలవుల్లో వారాంతపు సెలవులు 6 కాగా.. రాష్ట్ర-నిర్దిష్ట సెలవులు 10 ఉన్నాయి. అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు సెలవు ఉండనుంది. అక్టోబర్ 10న రెండవ శనివారం కాబట్టి భారతదేశం అంతటా బ్యాంకులు మూసివేస్తారు. అక్టోబర్ 17న మహా సప్తమి సందర్భంగా అగర్తలాలోని బ్యాంకులు అక్టోబర్ 17న మూసివేస్తారు. అక్టోబర్ 19న దసరా (మహాష్టమి)/మహానవమి/ఆయుధ పూజ/దుర్గా పూజ/విజయ దశమి/దుర్గాష్టమి అగర్తలా, ఐజ్వాల్, భువనేశ్వర్, చెన్నై, గౌహతి, ఇంఫాల్, ఇటానగర్, కోహిమా, కోల్‌కతా, పాట్నా, రాంచీ, షిల్లాంగ్‌లలోని బ్యాంకులు మూసివేస్తారు.

Bank Holidays

అక్టోబర్ 20న దసరా (విజయ దశమి)/మహానవమి, ఆయుధ పూజ/దుర్గా పూజ సందర్బంగా దేశవ్యాప్తంగా సెలవు ఉండగా.. గ్యాంగ్‌టక్, ఇంఫాల్ లో మాత్రం బ్యాంకులు ఓపెన్ ఉంటాయి. అక్టోబర్ 21న విజయ దశమి/దుర్గా పూజ (దసైన్) సందర్భంగా అగర్తలా, బెంగళూరు, గ్యాంగ్‌టక్, గౌహతి, కొచ్చి, కోల్‌కతా, తిరువనంతపురం నగరాల్లోని బ్యాంకులు అక్టోబర్ 21న మూసివేయనున్నారు.
అక్టోబర్ 22, 23 దుర్గా పూజ (దసైన్) సందర్బంగా గ్యాంగ్‌టక్‌లోని బ్యాంకులు అక్టోబర్ 22, 23 తేదీలలో మూసివేయబడతాయి. అక్టోబర్ 26న లక్ష్మీ పూజ, విలీన దినోత్సవం మరియు మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా అగర్తలా, చండీగఢ్, జమ్మూ, సిమ్లా, శ్రీనగర్‌లలోని బ్యాంకులు అక్టోబర్ 26న మూసివేస్తారు.

అక్టోబర్ 29న కర్వా చౌత్ సందర్భంగా సిమ్లాలోని బ్యాంకులు 29న మూసివేయబడతాయి. అక్టోబర్ 31న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా అహ్మదాబాద్‌లోని బ్యాంకులు అక్టోబర్ 31న మూసివేయనున్నారు. భారతదేశం అంతటా బ్యాంకులు ఆదివారాలు (అక్టోబర్ 4, 11, 18,25) మూసివేయబడతాయి. అలాగే, RBI మార్గదర్శకాల ప్రకారం రెండవ శనివారం (అక్టోబర్ 10) నాల్గవ శనివారం (అక్టోబర్ 24) కూడా బ్యాంకులకు సెలవు ఉటంుంది. ఈ రోజుల్లో బ్యాంక్ శాఖలు మూసివేయబడినప్పటికీ, వినియోగదారులు డిజిటల్ బ్యాంకింగ్ సేవలను ఉపయోగించుకోవచ్చు. బ్యాంక్ సెలవు దినాల్లో కూడా NEFT, RTGS, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, UPI, ATM సేవలు అందుబాటులో ఉంటాయి.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+