హైదరాబాద్ లో ఇళ్ల అమ్మకాలు భారీగా తగ్గాయి. రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ ప్రాప్ ఈక్విటీ నివేదిక ప్రకారం 2024 క్యాలెండర్ సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ప్రధాన భారతీయ నగరాల్లో గృహాల విక్రయాలు 18 శాతం తగ్గాయి. 2024 క్యూ2లో తొమ్మిది ప్రధాన నగరాల్లో 1,19,901 యూనిట్లు అమ్ముడయ్యాయని, అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే ఇది 18 శాతం క్షీణతతో 1,46,1947 హౌసింగ్ యూనిట్లు అమ్ముడయ్యాయని నినేదిక పేర్కొంది. తొమ్మిది ప్రధాన నగరాల్లో ముంబై, ఢిల్లీ NCR, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా, పూణే, నవీ ముంబై, థానే ఉన్నాయి.
ఏదేమైనప్పటికీ, గృహాల విక్రయాలు సంవత్సర ప్రాతిపదికన గణించినప్పుడు 2 శాతం మాత్రమే స్వల్పంగా తగ్గాయి. 2024 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 1,19,901 హౌసింగ్ యూనిట్లు అమ్ముడయ్యాయి, 2023 క్యూ2లో 1,21,856 యూనిట్లు అమ్ముడయ్యాయని నివేదిక పేర్కొంది. ప్రాప్‌ఈక్విటీ డేటా ప్రకారం గృహాల విక్రయాలు భారీగా తగ్గాయి. ఈ త్రైమాసికంలో హైదరాబాద్ లో ఇళ్ల విక్రయాలు 36 శాతం తగ్గాయి. హైదరాబాద్ తర్వాత ముంబైలో ఇళ్ల విక్రయాలు 25 శాతం తగ్గాయి. హైదరాబాద్‌లో క్యూ2 2024లో 15,016 హౌసింగ్ యూనిట్లు విక్రయించగా, క్యూ1 2024లో 23,595 నివాసాలు విక్రయించారు.

2024 ఏప్రిల్, జూన్ మధ్య (ఇప్పటి వరకు) ముంబైలో 13,032 యూనిట్ల విక్రయాలు జరిగాయి. ఇది Q1 2024లో 17,307గా ఉంది. బెంగళూరులో గృహాల విక్రయాలు 14 శాతం క్షీణించాయి. 2024 క్యూ2లో 15,127 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి, 2024 క్యూ1లో 17,547 యూనిట్లు అమ్ముడయ్యాయి. కోల్‌కతాలో హౌసింగ్ యూనిట్ల శోషణ దాదాపు 16 శాతం తగ్గిందని గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఢిల్లీలో మాత్రం ఇళ్ల విక్రయాలు పెరిగాయి. QoQ ప్రాతిపదికన 2 శాతం పెరగ్గా.. సంవత్సరం ప్రతిపాదికన 7 శాతం పెరిగాయి. ఢిల్లీ NCRలో Q2 2024లో 10,198 హౌసింగ్ యూనిట్లు అమ్ముడయ్యాయి, Q1 2024లో 9,510 యూనిట్లు విక్రయించారు.
కొత్త గృహాల సరఫరా కూడా QoQ ప్రాతిపదికన ఏడు శాతం క్షీణతను చూసింది. క్యూ2 2024 ఎన్నికల త్రైమాసికం అని, ఆ సమయంలో డెవలపర్లు తమ లాంచ్‌లను నిలిపివేశారని, దీని కారణంగా కొత్త లాంచ్‌లలో కొరత ఏర్పడిందని, దీని ఫలితంగా ఈ త్రైమాసికంలో అమ్మకాలు క్షీణించాయని సీఈఓ, ఎండీ ప్రాప్‌ఈక్విటీ సమీర్ జసుజా తెలిపారు. ఢిల్లీ NCRతో పాటు చెన్నైలో 10 శాతం, నవీ ముంబైలో 17 శాతం ఇళ్ల విక్రయాలు పెరిగాయి. అయితే హైదరాబాద్ లో ఇళ్ల ధరలు భారీగా పెరిగాయి. సామాన్యులు ఇళ్లు కొనలేని స్థితికి చేరుకున్నారు. అదే సమయంలో ఏపీలో అమరావతి అభివృద్ధికి అవకాశం ఉండడంతో హైదరాబాద్ లో ఇళ్ల ధరలు తగ్గే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications