UPI Payments: ఛార్జీలకు ముందే దేశంలో తగ్గిన యూపీఐ పేమెంట్స్..
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) లావాదేవీలు తగ్గుముఖం పట్టాయి. ఆగస్టుతో పోలిస్తే సెప్టెంబర్ లో యూపీఐ లావాదేవీలు 1.8 శాతం తగ్గాయి.నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఆగస్టులో 2,450 కోట్ల లావాదేవీలు నమోదు కాగా, సెప్టెంబర్‌లో ఇవి 2,407 కోట్లకు తగ్గాయి . లావాదేవీల మొత్తం విలువ కూడా 1.50 శాతం క్షీణించి రూ.29.82 లక్షల కోట్ల నుంచి రూ.29.37 లక్షల కోట్లకు చేరిది. పెద్ద మొత్తంలో జరిగే యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) చార్జీల అమలుకు కొన్ని రోజుల ముందు ఈ లెక్కలు రావడం గమనార్హం.
నెలవారీగా స్వల్ప తగ్గుదల ఉన్నప్పటికీ, ఏడాది ప్రాతిపదికన UPI లావాదేవీల సంఖ్య 23 శాతం పెరిగింది. లావాదేవీల విలువ ఏడాది ప్రాతిపదికన 18% వృద్ధిని నమోదు చేసింది. సెప్టెంబర్‌లో UPI రోజుకు సగటున 802 మిలియన్ల లావాదేవీలను నిర్వహించిందని, సగటు రోజువారీ లావాదేవీల విలువ సుమారు రూ.97,913 కోట్లుగా ఉందని NPCI తెలిపింది. ఆగస్టులో యూపీఐ 24.51 బిలియన్ల లావాదేవీలను నమోదు చేసి, ఏడాది ప్రాతిపదికన 22% వృద్ధిని సాధించింది. ఆ నెలలో ఈ వ్యవస్థ రూ.29.82 లక్షల కోట్ల విలువైన లావాదేవీలను నిర్వహించింది, ఇది అంతకుముందు ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 20% ఎక్కువ.

సవరించిన UPI MDR విధానం, రోజువారీ డిజిటల్ చెల్లింపులను ఉచితంగా ఉంచుతూనే, లావాదేవీల రకం విలువ ఆధారంగా శ్రేణుల వారీగా రుసుము నిర్మాణాన్ని ప్రతిపాదిస్తోంది. వ్యక్తుల మధ్య జరిగే లావాదేవీలకు (Person-to-Person - P2P), లావాదేవీ మొత్తంతో సంబంధం లేకుండా ఎటువంటి రుసుము (0%) ఉండదు. అదేవిధంగా రూ.2,000 వరకు జరిగే వ్యక్తి-నుండి-వ్యాపారి (Person-to-Merchant - P2M) లావాదేవీలు ఉచితంగానే ఉంటాయి. చిన్న వ్యాపారులు వరుసగా మూడు నెలల పాటు నెలకు రూ.1 లక్ష కంటే తక్కువ వసూళ్లను కలిగి ఉంటే, వారికి మర్చంట్ రుసుముల నుంచి మినహాయింపు లభిస్తుంది.
రూ.2,000 పైబడిన P2M లావాదేవీలకు, ప్రామాణిక MDRను 0.4%గా ప్రతిపాదించారు. దీనికి గరిష్టంగా రూ.300 ఛార్జీ ఉంటుంది. ఈ పరిమితి రూ.75,000 లేదా అంతకంటే ఎక్కువ లావాదేవీలకు వర్తిస్తుంది. తద్వారా అధిక విలువ గల చెల్లింపులపై రుసుమును పరిమితం చేస్తుంది. తక్కువ మార్జిన్లు లేదా ప్రత్యేక చెల్లింపు అవసరాలు ఉన్న కొన్ని రంగాలకు తక్కువ ఛార్జీలు ఉంటాయి. యుటిలిటీస్, టెలికాం, ఇన్సూరెన్స్, ఇంధనం, రైల్వేలు, విద్యారంగంలో రూ.2,000 పైబడిన లావాదేవీలకు ఫ్లాట్ రూ.5 రుసుము వర్తిస్తుంది. అదే సమయంలో మ్యూచువల్ ఫండ్, స్టాక్ బ్రోకరేజ్ చెల్లింపులపై 0.02 శాతం MDR ఉంటుంది. దీనికి కూడా రూ.300 గరిష్ట పరిమితి ఉంటుంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
