UPI: దేశంలో రికార్డులు సృష్టిస్తున్న యూపీఐ పేమెంట్స్..
ఇండియాలో డిజిటల్ పేమెంట్స్ భారీగా పెరుగుతోన్నాయి. ముఖ్యంగా యూపీఐ పేమెంట్స్ రికార్డు సృష్టిస్తున్నాయి. UPI మొత్తం ప్రపంచంలో భారతదేశానికి భిన్నమైన గుర్తింపును ఇచ్చింది. చాలా దేశాలు తమ దేశాల్లో కూడా ఈ చెల్లింపు విధానాన్ని అమలు చేస్తున్నాయి. భారతీయులు కూడా యూపీఐ తెగ వాడేస్తున్నారు. చిన్న దుకాణం నుంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో కూడా యూపీఏ పేమెట్లు చేస్తున్నారు.
క్రెడిట్ కార్డుల కూడా యూపీఐ పేమెంట్లు చేస్తున్నారు. కూరగాయలు, పండ్లు, రేషన్ కొనుగోలు వంటి చిన్న లావాదేవీల కోసం అలాగే పెద్ద చెల్లింపుల కోసం ఫోన్ ద్వారా యూపీఐని విరివిగా వాడుతున్నారు. దీంతో ప్రతి నెలా యూపీఐ లావాదేవీల కొత్త రికార్డులను సృష్టిస్తోంది. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) శనివారం యాపీఐ లావాదేవీల డేటాను విడుదల చేసింది. దేశంలో యూపీఐ లావాదేవీల్లో సరికొత్త రికార్డు సృష్టించినట్లు వివరాలు బట్టి తెలుస్తోంది.

మే నెలలో దేశంలో మొత్తం రూ.20.45 లక్షల కోట్ల విలువైన యూపీఐ లావాదేవీలు జరిగినట్లు ఎన్పీసీఐ పేర్కొంది. 2023 సంవత్సరంలో మే నెలతో పోలిస్తే మే 2024లో యూపీఐ లావాదేవీల సంఖ్య వాల్యూమ్ పరంగా 49 శాతం, విలువ పరంగా 39 శాతం పెరిగింది. మే నెలలో మొత్తం 14.04 బిలియన్ల యూపీఐ లావాదేవీలు జరిగినట్లు ఎన్పీసీఐ వివరించింది. వీటిలో మొత్తం రూ.20.45 బిలియన్ల లావాదేవీలు జరిగాయి.
ఏప్రిల్ 2024లో 13.30 బిలియన్ల లావాదేవీలు జరిగినట్లు పేర్కొంది. వీటిలో రూ.19.64 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయి. ఏప్రిల్‌తో పోల్చితే మే నెలలో పరిమాణం పరంగా 6 శాతం, విలువ పరంగా 4 శాతం పెరుగుదల నమోదైంది. దేశంలో యూపీఐ ఏప్రిల్ 2016లో ప్రారంభమయ్యాయి. ఈ కాలంలో, IMPS లావాదేవీలు కూడా 1.45 శాతం పెరిగాయి. ఇది 55.8 కోట్ల లావాదేవీలకు చేరుకుంది. IMPS లావాదేవీల ద్వారా రూ.6.06 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయి. ఏప్రిల్‌లో రూ.5.92 లక్షల కోట్లతో పోలిస్తే ఈ సంఖ్య 2.36 శాతం పెరిగింది.


Click it and Unblock the Notifications