అక్టోబరు-డిసెంబర్ త్రైమాసికంలో స్మార్ట్‌ఫోన్ సరఫరా భారీగా పడిపోయింది. దేశీయంగా స్మార్ట్ ఫోన్ల సరఫరా 27% పైగా పడిపోయాయ నిమార్కెట్ పరిశోధన సంస్థ ఐడీసీ శుక్రవారం తెలిపింది. దీనికి ప్రధాన కారణం ద్రవ్యోల్బణం అని వివరించింది. 2021 ఇదే త్రైమాసికంలో 40.6 మిలియన్ యూనిట్ల స్మార్ట్ ఫోన్లను సరఫరా చేశారు. ప్రస్తుత త్రైమాసికంలో ఇది 29.6 మిలియన్ యూనిట్లుగా ఉంది.

చిప్ లు
చిప్ ల సరఫరా మెరుగుపడినప్పటికీ ద్రవ్యోల్బణం కారణంగా సరఫరా తగ్గినట్లు IDC పేర్కొంది. 2021 సమయంలో కోవిడ్ కారణంగా చాలా మంది విద్యార్థులు ఆన్ లైన్ క్లాసులు విన్నారు. దానికి భారీగా స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేశారు. కానీ ఇప్పడు ఆ పరిస్థతి లేదని ఐడీసీ వివరించింది. స్వల్ప ధరల స్మార్ట్ ఫోన్లు(సుమారు రూ. 25,000) ధరల విభాగంలో స్మార్ట్‌ఫోన్ల సరఫరా 15% తగ్గాయి.

ప్రీమియం ఫోన్లు
మిడ్-ప్రీమియం, ప్రీమియం ధరల స్మార్ట్ ఫోన్ల(రూ. 41,000) సరఫరా 55% పెరిగాయి.మధ్య స్థాయి, ప్రీమియం ఫోన్ల సరఫరాలు మాత్రం 20% పెరిగాయి. ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్‌ల మార్కెట్ వాటా అంటే( రూ. 12,500) 54 శాతం నుంచి 46 శాతానికి తగ్గింది. స్మార్ట్ ఫోన్ మార్కెట్ వాటా విషయంలో డిసెంబరు త్రైమాసికంలో 18.6% వాటాతో షియోమీ అగ్రస్థానంలో ఉంది. స్మార్ట్‌ఫోన్ విభాగంలో కొత్త లాంచ్‌ల కొరత దాని వృద్ధిని పరిమితం చేసిందని IDC ఇండియా, క్లయింట్ డివైజెస్ రీసెర్చ్ మేనేజర్, ఉపాసన జోషి తెలిపారు.

వకేందర్ సింగ్
పెరుగుతున్న ధరలు మరియు అదనపు ఇన్వెంటరీలు కనీసం ప్రస్తుత సంవత్సరం మొదటి అర్ధభాగంలో ఆందోళన కలిగిస్తాయని భావిస్తున్నామని IDC అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ వకేందర్ సింగ్ తెలిపారు. "స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో చాలా కష్టతరమైన మరియు సుదీర్ఘమైన రికవరీని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే పెరుగుతున్న ధరలు, అదనపు ఇన్వెంటరీల కొనుగోళ్లపై ప్రభావం చూపుతాయి" అని సింగ్ చెప్పారు.

12 శాతం తక్కువ
2022లో 20.1 కోట్ల సెల్‌ఫోన్లు దేశీయ విపణిలోకి సరఫరా అయ్యాయి. 2021తో పోలిస్తే ఇవి 12% తక్కువ. ఇందులో ఫీచర్ ఫోన్లు 5.7 కోట్లు ఉన్నాయి. వీటి సరఫరాలు కూడా 18% తగ్గాయి. సామాన్య, మధ్యతరగతి వర్గాలపైనే ద్రవ్యోల్బణ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందువల్లే అందుబాటు ధర స్మార్ట్‌ఫోన్లకు గిరాకీ తగ్గిందని సింగ్ అభ్రిప్రాయపడ్డారు.


Click it and Unblock the Notifications