Investment Ideas: దేశీయ స్టాక్ మార్కెట్లు 2024లో చరిత్రలో ఎన్నడూ చూడని ర్యాలీని కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో జూన్ మాసంలో సూచీలు ప్రతిరోజూ తమ గత రికార్డులను బ్రేక్ చేస్తూ ముందుకు సాగుతున్నాయి.
ఈ క్రమంలో 2024 మెుదటి ఆరు నెలల కాలంలో బెంచ్ మార్క్ సూచీల పనితీరును గమనిస్తే.. సెన్సెక్స్ సూచీ 10 శాతం, బీఎస్ఈ మిడ్ క్యాప్ సూచీ 25 శాతం, బీఎస్ఈ స్మాల్ క్యాప్ సూచీ 21 శాతం ర్యాలీని నమోదు చేశాయి. అయితే రానున్న కాలంలో ఈ ర్యాలీ కొనసాగుతుందా అనే అనుమానాలు ఇన్వెస్టర్లలో కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో దేశీయ మార్కెట్లపై చోళా సెక్యూరిటీస్ ఈక్విటీ అండ్ డెరివేటివ్ రీసెర్చ్ హెడ్ ధర్మేష్ కాంత్ అభిప్రాయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..

స్మాల్ అండ్ మిడ్ క్యాప్ సూచీలు ఎక్కువగా పెరగటానికి అసలు కారణం మార్కెట్లోని బ్యాంకింగ్, ఫైనాన్షియల్స్, ఆటో, ఆటో విడిభాగాలు, రియల్ ఎస్టేట్, ఈఎంఎస్, టెక్స్‌టైల్స్ రంగాల్లోని కొన్ని కంపెనీల షేర్లు ర్యాలీకి దోహదపడ్డాయి. మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం టాప్ 500 స్టాక్‌లలో కేవలం 30% మాత్రమే వాటి ఆల్-టైమ్ గరిష్ఠ స్థాయిల వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. రాబోయే 2-3 ఏళ్లలో దృక్కోణంలో, రైల్వే మౌలిక సదుపాయాలు, రక్షణ, ప్రభుత్వ రంగ సంస్థల మిశ్రమం పెట్టుబడిదారులకు మంచిగా ఉంటుంది. పెట్టుబడిదారులు 3 ఏళ్ల కంటే ఎక్కువ హోల్డింగ్ వ్యవధిలో ప్రయోజనాలను పొందేందుకు తదుపరి సంవత్సరంలో SIP ప్రాతిపదికన వారి పోర్ట్‌ఫోలియోలకు RVNL, HAL, LICలను జోడించాలని సూచించారు.
క్యూ1 త్రైమాసిక ఫలితాలపై స్పందిస్తూ ఆదాయాలు మ్యూట్‌గా ఉంటాయని ఆశిస్తున్నట్లు ధర్మేష్ కాంత్ పేర్కొన్నారు. అధిక ఇన్‌పుట్ ధరలు, తక్కువ సింగిల్-డిజిట్ వాల్యూమ్ పెరుగుదల, సాధారణంగా ధర నిర్ణయ శక్తి లేకపోవడం వల్ల ఆపరేటింగ్ మార్జిన్‌లలో జారిపోయే అవకాశం ఉన్న ప్రధాన ముఖ్యాంశాలుగా ఉన్నాయి.
IMD ఈ సీజన్‌లో సాధారణం కంటే ఎక్కువ రుతుపవనాల అంచనాను కొనసాగిస్తోంది. PLI స్కీమ్స్ ద్వారా మౌలిక సదుపాయాలు, రక్షణ, రైల్వేలు, EMSలను పెంచడంపై దృష్టి ఉంటుంది. ఈ క్రమంలో టెక్స్‌టైల్స్, కెమికల్స్ రంగాల షేర్లు సైతం ఇన్వెస్టర్లు తమ పెట్టుబడి వ్యూహాల్లో జోడించాలని తెలిపింది. ఈ క్రమంలో ఇన్వెస్టర్లు డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ లో ఎస్ఐపీ రూపంలో పెట్టుబడులు పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. రానున్న కాల్లో డిఫెన్స్, రైల్వేస్, బ్యాంకింగ్, క్యాపిటల్ గెయిన్స్ రంగాల షేర్లు లాభపడతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఫోకస్ ఈ రంగాలపై ఉంటుందని తెలుస్తున్న వేళ ఇన్వెస్టర్లు వీటిలో పెట్టుబడి అవకాశాలను అన్వేషించొచ్చని వెల్లడించారు.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications