IT News: చాలా కాలం తర్వాత మందగమనంతో ఇబ్బందుల నుంచి పూర్తిగా తేరుకుంటోంది. తాజాగా అమెరికా టెక్ దిగ్గజం యాక్సెంచర్ గురువారం ప్రకటించిన త్రైమాసిక ఫలితాలు ఆశాజనకంగా ఉండటంతో పరిశ్రమపై ఇన్వెస్టర్లలో నమ్మకాలు బలపడుతున్నాయి. ఐటీ మేజర్ వాస్తవానికి అంచనా వేసిన దాని కంటే ఉత్తమ పనితీరుతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
ప్రధానంగా జెనరేటివ్ ఏఐ కోసం డిమాండ్ స్థిరంగా బలంగా ఉండటంతో కంపెనీ మంచి పనితీరును కనబరిచింది. అలాగే క్లయింట్లు ఏఐ వినియోగానికి మెుగ్గుచూపుతున్న వేళ తొలి త్రైమాసికంలో టెక్ కంపెనీ ఆదాయం ఏకంగా 17.7 బిలియన్ డాలర్లుగా నిలిచింది. దీంతో అమెరికా మార్కెట్లలో స్టాక్ దాదాపు 7 శాతం లాభపడింది. ఇదే క్రమంలో భారతీయ టెక్ కంపెనీలు ఇన్ఫోసిస్, విప్రోలకు చెందిన అమెరికా డిపాజిటరీ రిసీట్స్ కూడా 2-3 శాతం మధ్య లాభపడ్డాయి. యాక్సెంచర్ ఉత్తమ పనితీరు భారతీయ ఐటీ పరిశ్రమలోని కంపెనీల షేర్లపై శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో సానుకూలంగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. శుక్రవారం ట్రేడింగ్ సమయంలో టెక్ రంగానికి చెందిన కంపెనీల షేర్లు ఈ మేరకు లాభపడవచ్చని వారు అంచనా వేస్తున్నారు.

అయితే వాస్తవానికి నిపుణులు యాక్సెంచర్ మెుదటి త్రైమాసికంలో 17.12 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని నమోదు చేయవచ్చని అంచనా వేసినప్పటికీ వాటిని అధిగమించి ఉత్తమ పనితీరును కంపెనీ నమోదు చేసింది. కంపెనీ AI ప్రాజెక్ట్‌ల స్థాయిని పెంచడానికి, సామర్థ్యాన్ని పెంచడానికి, ఖర్చులను తగ్గించడానికి ప్రయత్నిస్తూ వ్యాపార కార్యకలాపాలను డిజిటలైజ్ చేయడానికి భారీగా పెట్టుబడి పెట్టే క్లయింట్ల నుంచి లాభాలను అందుకుంటుందని అంచనాలు ఉన్నాయి. ఇదే క్రమంలో తొలి త్రైమాసికంలో కంపెనీ బుకింగ్స్ ఆర్డర్ విలువ 18.7 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు వెల్లడైంది. అలాగే జనరేటివ్ ఏఐ వ్యాపారం కొత్తగా 1.2 బిలియన్ డాలర్ల ప్రాజెక్టులను నమోదు చేసినట్లు కంపెనీ వెల్లడించింది. ఈ క్రమంలో కంపెనీ తన వార్షిక ఆదాయ వృద్ధి ఈ సారి 4-7 శాతం మధ్య ఉండవచ్చని సానుకూల ధోరణిని ప్రకటించింది.
వాస్తవానికి ఐటీ దిగ్గజ సంస్థ అమెరికా కేంద్రంగా పనిచేస్తున్నప్పటికీ.. భారతదేశంలోనే కంపెనీ ఉద్యోగుల్లో ఎక్కువ శాతం ఉన్నారు. అయితే వరుసగా రెండవ త్రైమాసికంలోనూ కంపెనీ తన ఉద్యోగుల సంఖ్యను పెంచుకున్నట్లు ప్రకటించింది. దీంతో రిక్రూట్మెంట్స్ జోరు కొనసాగుతోందని, టెక్ పరిశ్రమకు మంచి రోజులు తిరిగి వస్తున్నాయని నిపుణులు చెబుతున్న మాటలు నిజమేనని ఈ వివరాలు రుజువుచేస్తున్నాయి. ప్రస్తుతం పరిశీలనలో ఉన్న త్రైమాసికంలో కంపెనీ కొత్తగా 24,697 మంది కొత్త ఉద్యోగులను రిక్రూట్ చేసుకుందని వెల్లడించింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా కంపెనీ ఉద్యోగుల సంఖ్య మెుత్తంగా 7,99,000లకు చేరుకుంది. అయితే ఇదే క్రమంలో అట్రిషన్ రేటు 1 శాతం పెరిగి ప్రస్తుతం 12 శాతంగా నమోదైంది. ప్రస్తుతం యాక్సెంచర్ న్యూ టెక్నాలజీల్లో చూస్తున్న గ్రోత్ భవిష్యత్తు ఐటీ పరిశ్రమపై ఆశాజనకమైన ధోరణిని ప్రదర్శిస్తోంది.
More From GoodReturns

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications