Accenture: హైదరాబాద్‌లో యాక్సెంచర్ భారీ క్యాంపస్.. ఎక్కడంటే..!
హైదరాబాద్ లో ఐటీ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే హైదరాబాద్ లో ప్రపంచస్థాయి ఐటీ కంపెనీలు ఉన్నాయి. కొన్ని కంపెనీలు తమ కార్యకాలాపాలను విస్తరిస్తున్నాయి. తాజాగా యాక్సెంచర్ కంపెనీ హైదరాబాద్ లో దాదాపు 1 మిలియన్ చదరపు అడుగుల కమర్షియల్ స్థలాన్ని 10 సంవత్సరాల పాటు లీజుకు తీసుకుంది. ఇందుకు రూ. 1000 కోట్ల అద్దె చెల్లించనుంది. హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో అపర్ణ ఐటీ హబ్ ఎల్ఎల్పీ యాజమాన్యంలోని అపర్ణ టెక్నోపాలసీస్ వాణిజ్య భవన సముదాయంలో ఈ స్థలం అద్దెకు తీసుకున్నారు.
ఈ కమర్షియల్ సముదాయంలో బ్లాక్ ఏ 1 నుంచి 11 అంతస్తుల వరకు.. బ్లాక్ బీ లో 2 నుంచి 11 అంతస్తుల వరకు విస్తరించి ఉన్నాయి. ఈ లీజు ఒప్పందం 2026 జూన్ 10న జరిగింది. అమల్లో ఉంది. ఈ ఒప్పందం ప్రకారం యాక్సెంచర్ కు ప్రత్యేకంగా 996 కార్ పార్కింగ్ స్లాట్లు కేటాయించారు. ఇందులో 976 స్లాట్లు కార్యాలయ అవసరాలకు, అదనంగా 20 స్లాట్లు కేఫ్టేరియా కార్యకలాపాల కోసం కేటాయించారు. ఈ లీజు రెండు దశలుగా రూపొందించారు. మొదటి దశ ఒప్పందం 10 సంవత్సరాల కాలానికి కుదుర్చుకోగా, రెండవ దశ లీజు కాలం 9 సంవత్సరాల 7 నెలలుగా ఉంది.

మొదటి దశ లీజు 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. రెండో దశ లీజ్ 2026 సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభం కానుంది. మొదటి దశకు అద్దె చెల్లింపులు 2026 డిసెంబర్ 16 ప్రారంభ కానున్నాయి. అలాగే రెండో దశకు అద్దె చెల్లింపులు ఫిబ్రవరి 1, 2027 నుంచి ప్రారంభం కానున్నాయి. కార్యాలయ స్థలానికి యాక్సెంచర్ నెలకు చదరపు అడుగుకు రూ.74 చెల్లించనుంది. కేఫటేరియా విభాగం కోసం నెలకు చదరపు అడుగుకు రూ.37 అద్దె చెల్లనుంది. హైదరాబాద్ దేశంలో అత్యంత ఆదరణ పొందిన ఆఫీస్ మార్కెట్లలో ఒకటిగా అవతరించింది.
నెట్‌ఫ్లిక్స్, ఎలి లిల్లీ, కాస్ట్‌కో, మెక్‌డొనాల్డ్స్ వంటి కంపెనీలకు చెందిన 70కి పైగా గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు (GCCలు) కూడా హైదరాబాద్‌లోనే ఉన్న సంగతి. హైదరాబాద్ లో వివిధ రంగాలకు చెందిన దాదాపు 40 కంపెనీలు తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. ఇందులో తయారీ, ఇంజనీరింగ్, హాస్పిటాలిటీ, బీఎఫ్ఎస్ఐ, పునరుత్పాదక ఇంధనం, ప్యాకేజింగ్ రంగాలకు చెందిన గూడియర్, వాన్‌గార్డ్ వంటి సంస్థలు ఉన్నాయి. అమెరికన్ ఎయిర్‌లైన్స్, సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్, నెట్‌ఫ్లిక్స్, కాస్ట్‌కో, ఇన్‌స్పైర్ బ్రాండ్స్, హావోర్త్, టి-మొబైల్, సోనాటైప్, లోరియల్, మెక్‌డొనాల్డ్స్, అమెజాన్, కార్ల్స్‌బర్గ్, హైనెకెన్, ల్యాండ్ ఓ'లేక్స్ వంటి అంతర్జాతీయ సంస్థలు కూడా హైదరాబాద్ లో ఉన్నాయి.


Click it and Unblock the Notifications