యాక్సెంచర్ ఉద్యోగులకు బిగ్ షాక్: AI దెబ్బకు సెలవులు కట్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీతో టెక్ ప్రపంచం వేగంగా మారుతోంది. ఈ మార్పుల వల్ల ప్రతీ ఐటీ సేవల సంస్థ ఆదాయం, లాభాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ గడ్డు పరిస్థితుల నుంచి బయటపడేందుకు, యాక్సెంచర్ సంస్థ తన ఉద్యోగులను ఓ వింత కోరిక కోరింది. వచ్చే నెల రోజులు సెలవులు తీసుకోకుండా పనిచేసి, కంపెనీకి అదనపు వ్యాపారం తీసుకురావాలని యాజమాన్యం కోరినట్లు తెలుస్తోంది.

ఈ విషయం టెక్ రంగంలో పెద్ద సంచలనం సృష్టిస్తోంది. సాధారణంగా, టెక్ కంపెనీలు ఉద్యోగుల సంక్షేమ విషయాల్లో జోక్యం చేసుకోవు. దానికి తోడు, యాక్సెంచర్ ఐర్లాండ్‌కు చెందిన సంస్థ కావడంతో, అక్కడ ఉద్యోగుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. మరి అలాంటిది, ఈ నిర్ణయం తీసుకోవడానికి అసలు కారణం ఏంటి?

యాక్సెంచర్ తన మూడో త్రైమాసిక ఫలితాలను ప్రకటించినప్పుడు, మార్కెట్ అంచనాలను అందుకోలేకపోయింది. సేల్స్, కొత్త వ్యాపార లక్ష్యాలను చేరుకోలేకపోవడంతో, కంపెనీ షేర్లు ఏకంగా 20 శాతం వరకు కుప్పకూలాయి.

Accenture AI impact employee leaves business growth Q3 results AI

ఐర్లాండ్‌లో ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ 1న ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో, ఆగస్టు నెలలో వీలైనంత ఎక్కువ వ్యాపారం సంపాదించేందుకు, ఉద్యోగులు తమ వినియోగించుకోని సెలవులను వచ్చే ఆర్థిక సంవత్సరంలో తీసుకోవాలని యాక్సెంచర్ యాజమాన్యం కోరింది. ఇందుకోసం సెలవుల పాలసీలో కీలక మార్పులు కూడా చేసినట్లు మనీకంట్రోల్ నివేదించింది.

అయితే, దీనిపై యాక్సెంచర్ సంస్థ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ, యాక్సెంచర్ సీఈఓ జూలీ స్వీట్ ఉద్యోగులకు పంపిన ఒక మెమోలో, "నాలుగో త్రైమాసికంలో బలమైన ఫలితాలను ఆశిస్తున్నామని మన వాటాదారులు ఎదురుచూస్తున్నారు. దీన్ని సాధించడానికి ప్రతి ఒక్కరి సహకారం అవసరం" అని పేర్కొన్నట్లు బ్లూమ్‌బెర్గ్ తెలిపింది.

దీని అర్థం, ఈ త్రైమాసికంలో మన కస్టమర్లకు కొత్త, వినూత్న మార్గాల్లో సేవలు అందించి, అధిక ఆదాయాన్ని సంపాదించాలి. అలాగే, సేల్స్ విభాగం ఈ క్వార్టర్‌లో చిన్న, మధ్య, పెద్ద ప్రాజెక్టులను సంపాదించి, వాటిని విజయవంతంగా పూర్తి చేయాలని భావిస్తున్నారు.

సరిగ్గా ఈ కారణంతోనే, ఈ ఏడాది సెలవులను వచ్చే ఏడాదికి బదిలీ చేసుకునేలా పాలసీలో మార్పులు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. మే నెలతో ముగిసిన త్రైమాసికంలో (మార్చి, ఏప్రిల్, మే) కంపెనీ కొత్త వ్యాపారం 2 శాతం తగ్గడం ఇక్కడ గమనించాల్సిన విషయం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+