యాక్సెంచర్ బోనస్: షాకింగ్ ట్విస్ట్! జీతాల పెంపు కథ ఏమైంది?
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజం యాక్సెంచర్ (Accenture) తన ఉద్యోగులకు బోనస్‌ను ప్రకటించింది. సాధారణంగా ఐటీ కంపెనీలు ఉద్యోగులకు ఇచ్చే జీతంతో పాటు బోనస్‌లు కూడా అందిస్తుంటాయి. అదే కోవలో యాక్సెంచర్ కూడా ఈ బోనస్ ప్రకటనను విడుదల చేసింది.
యాక్సెంచర్‌లో పనిచేస్తున్న 8 లక్షల మంది ఉద్యోగుల్లో అత్యధికులు భారతీయులే. అందుకే ఈ సంస్థ చేసే ఏ ప్రకటన అయినా వేలాది మంది ఐటీ ఉద్యోగులపై ప్రభావం చూపుతుంది. ఈసారి, ఉద్యోగుల పనితీరు ఆధారంగా భారతీయ ఉద్యోగులకు 8% నుంచి 26% వరకు బోనస్ ప్రకటించింది.
ఉద్యోగుల పనితీరు, నైపుణ్యాలు, సీనియారిటీ ఆధారంగా 8% నుంచి 26% వరకు బోనస్ మొత్తాన్ని అందించింది. కంపెనీ అంచనాలకు తగ్గట్టుగా అద్భుతమైన పనితీరు కనబరిచిన వారికి ఈ బోనస్ లభించింది. అదే సమయంలో, కంపెనీ ఆశించిన స్థాయిలో రాణించని ఉద్యోగులకు ఈసారి బోనస్ ఇవ్వలేదని సమాచారం.

ఉద్యోగులకు బోనస్‌ల విషయంలో మంచిగానే వ్యవహరించినా, చాలా మంది ఉద్యోగులకు ఏటా ఇచ్చే జీతాల పెంపును (Salary Hikes) మాత్రం తాత్కాలికంగా నిలిపివేసింది. కంపెనీ ఖర్చులను నియంత్రించుకోవడానికి, స్థూల ఆర్థిక పరిస్థితులను ఎదుర్కోవడానికే యాక్సెంచర్ జీతాల పెంపును తాత్కాలికంగా ఆపేసినట్లు తెలుస్తోంది.
యాక్సెంచర్ కంపెనీలో ప్రతి నలుగురిలో ముగ్గురు ఉద్యోగులు భారత్‌లోనే పనిచేస్తున్నారు. కాబట్టి, జీతాలు, బోనస్‌లకు సంబంధించి కంపెనీ తీసుకునే ఇలాంటి నిర్ణయాలు భారత టెక్నాలజీ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. 2023, 2024 సంవత్సరాల్లో ఉద్యోగులకు జీతాల పెంపును నిలిపివేసిన ఈ సంస్థ, గత ఏడాది జూన్‌లో నామమాత్రపు పెంపును ఇచ్చింది. ఏడాది గడిచినా, ఇప్పటికీ జీతాల పెంపుపై ఎలాంటి ప్రకటన చేయలేదు.
గత కొన్నేళ్లుగా యాక్సెంచర్ ఉద్యోగులకు జీతాల పెంపు, ప్రమోషన్లు ఇవ్వకుండా దాటవేస్తోంది. ఐటీ కంపెనీలకు గత కొన్ని సంవత్సరాలుగా సవాళ్లు ఎదురవుతూనే ఉన్నాయి. ఏఐ (AI) రాక, అమెరికా ఆర్థిక మాంద్యం వంటి కారణాలతో కంపెనీలు ఉద్యోగులను తగ్గించుకోవడం, జీతాల పెంపును నిలిపివేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నాయి.


Click it and Unblock the Notifications