Tirupati: భారీగా అక్రమాస్తులు కూడబెట్టిన టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం..
తిరుమల తిరుపతి దేవస్థానం డిప్యూటీ ఈవో మెండు లోకనాథం నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఆదాయానికి మించి అస్తుల ఆరోపణల నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచి తిరుపతి పెదకాపు లేఔట్‌లోని లోకనాథం ఇంటితో పాటు ఆయన బంధువుల ఇళ్లలోనూ ఏకకాలంలో రైడ్స్ నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఉదయం 6 గంటల నుంచి 7 బృందాలుగా ఏర్పడిన అధికారులు దాదాపు సాయంత్రం వరకు సోదాలు కొనసాగించారు. తిరుమలలో లోకనాథంకు సంబంధించిన వసతిగృహంతో పాటు, తిరుపతిలోని లోకనాథం ఇద్దరు బావమరుదుల ఇళ్లతో పాటు, ఏర్పేడు మండలం చెల్లూరులోని అతని సోదరుడి నివాసంలో కూడా తనిఖీలు నిర్వహించారు.
తిరుపతి ఎస్టీవీ నగర్ ఎస్‌బీఐ బ్రాంచ్ లాకర్లను పరిశీలించారు. ఏసీబీ దాడుల సమయంలో లోకనాథం ఇంట్లోనే ఉన్నట్లు తెలిసింది. సోదాల్లో రూ.కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, స్థిర, చరాస్తులు గుర్తించినట్లు తెలుస్తోంది. 2011లో తితిదే డిప్యూటీ ఈవో భూపతిరెడ్డి నివాసంలో ఏసీబీ సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. దాదాపు 15 ఏళ్ల తర్వాత తితిదే ఉద్యోగి నివాసంలో సోదాలు చేయడం ఇదే మొదటిసారి. పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో పని చేస్తూ అక్రమాస్తులు కూడబెట్టడంపై చాలా మంది అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లోకనాథం రూ.కోట్లలోనే అక్రమంగా సంపాదించినట్లు సమాచారం.

తిరుమల డిప్యూటీ ఈవో లోకనాధం పై ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణల నేపథ్యంలో సోదాలు నిర్వహించామని ఏసీబీ డిఎస్పీ శ్రీనివాస్ రావు చెప్పారు. ఆదాయానికి మించి ఆస్తుల వ్యవహారంలో కేసు నమోదు చేసి ఉదయం నుంచి తనిఖీలు నిర్వహించినట్లు వెల్లడించారు. తిరుపతి నగరంలో పెద్దకాపు లేఅవుట్‌లో ఉన్న లోకనాథం నివాసంతో పాటు ఏకకాలంలో 5 చోట్ల సోదాలు చేశామని పేర్కొన్నారు. లోకనాథం బంధువులు, ఇద్దరు బావమరుదుల ఇళ్లతో పాటు ఆయన సోదరుడి నివాసం, తిరుమలలోని ఆయన కార్యాలయంలోనూ దాడులు చేసినట్లు వివరించారు. తనిఖీలలో పలు పత్రాలు, నగదు, బంగారం, వెండిని గుర్తించినట్లు వివరించారు. ఇప్పటి వరకు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు గుర్తించామని పూర్తి వివరాలను దర్యాప్తు ముగిసిన తర్వాత ప్రకటిస్తామని తెలిపారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications