Adani News: అదానీ కంపెనీపై మనసుపారేసుకున్న అబుదాబీ ఇన్వెస్టర్.. క్యూ కట్టిన దిర్హామ్స్..
Adani Enterprises: అదానీకి ప్రస్తుతం అదృష్ట కాలం నడుస్తోంది. మార్కెట్ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ.. విదేశీ ఇన్వెస్టర్లు మాత్రం అదానీ గ్రూప్ కంపెనీలతో ప్రేమలో పడుతున్నారు. వాటిలో తమ పెట్టుబడులను గణనీయంగా పెంచుకుంటున్నారు.
అబుదాబికి చెందిన ప్రముఖ ఇన్వెస్టర్ ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ(IHC) అదానీ గ్రూప్ ప్రముఖ ఇన్వెస్టర్లలో ఒకరు. కంపెనీ తాజాగా అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో తన వాటాను పెంచుకుంది. దీంతో ఇప్పుడు కంపెనీలో IHC వాటా 5 శాతానికి పైగా పెరిగింది. జూన్ చివరి వరకు IHC దాని అనుబంధ సంస్థ గ్రీన్ ఎంటర్‌ప్రైజెస్ ఇన్వెస్ట్‌మెంట్ హోల్డింగ్ RSC లిమిటెడ్ ద్వారా అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో 3.53% వాటాను మాత్రమే కలిగి ఉంది. ఈ వార్తలతో నేడు మార్కెట్లో అదానీ ఎంటర్ ప్రైజెస్ స్టాక్ భారీగా లాభపడింది.

దీనికి ముందు గతవారం అబుదాబి ఇన్వెస్టర్ IHC అదానీ గ్రూప్‌కు చెందిన రెండు కంపెనీల్లో వాటాలను విక్రయించటం ఆసక్తికరంగా నిలిచింది. ఈ క్రమంలోనే అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్‌లో తన పెట్టుబడులను అమ్మేసేందుకు నిశ్చయాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఇటీవల IHC తెలియజేసింది. అయితే దీనికి సంబంధించి కొనుగోలుదారుల వివరాలను మాత్రం ప్రకటించలేదు. జూన్ త్రైమాసికం నాటికి అదానీ గ్రీన్ ఎనర్జీలో 1.26 శాతం, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్‌కు 1.41 శాతం వాటాలను హోల్డ్ చేస్తోంది.
ఏప్రిల్ 2022లో అదానీ గ్రూప్ ఫ్లాగ్‌షిప్ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో ఒక బిలియన్ డాలర్లను IHC పెట్టుబడిగా పెట్టింది. దీనికి తోడు అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్‌లో ఒక్కొక్కటి $500 మిలియన్లు పెట్టుబడి పెట్టిన సంగతి తెలిసిందే. వీటిని దీర్ఘకాలం కోసం నిర్థేశించినట్లు అప్పట్లో వెల్లడించింది. అయితే తాజాగా తమ పోర్ట్‌ఫోలియో తిరిగి బ్యాలెన్స్ చేసే వ్యూహంలో భాగంగా ప్రస్తుత అదానీ గ్రూప్ వాటాల విషయంలో మార్పులు చేర్పులు చేస్తోంది.


Click it and Unblock the Notifications