Mutual Funds: డబ్బంతా ఆ పది స్టాక్‍ల్లోనే..! మ్యూచువల్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్ లిస్ట్ ఇదే..
మ్యూచువల్ ఫండ్స్ అంటే పెట్టుబడిదారుల వద్ద డబ్బును తీసుకుని ఫండ్ మేనేజర్లు పలు స్టాకుల్లో పెట్టుబడి పెడతారు. అయితే ఈక్విటీ మ్యూచువల్ ఫడ్స్ లోని దాదాపు 35 శాతం డబ్బును 10 స్టాకుల్లో పెట్టుబడి పెట్టారు. రూ. 4.75 లక్షల కోట్లను ఈ స్టాకుల్లో ఇన్వెస్ట్ చేశారు. అత్యధికంగా ఐసీఐసీఐ బ్యాంకులో పెట్టుబడి పెట్టారు. ఇందులో 6.7 శాతం అంటే దాదాపు రూ. 1.4 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టారు. ఐసీఐసీఐ తర్వాత మరో ప్రైవేట్ రంగ బ్యాంకు HDFC బ్యాంకులో పెట్టుబడి పెట్టారు.
టాప్ 10 హోల్డింగ్స్
ఈ స్టాక్ లో 2.64 శాతం అంటే రూ. 1.16 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఇన్ఫోసిస్ లో రూ.90,577 కోట్లు పెట్టుబడి పెట్టారు. అయితే 10 స్టాకుల్లో ఐటీ స్టాక్ ఇన్ఫోసిస్ ఒక్కటే. వీటి తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్, SBI, యాక్సిస్ బ్యాంక్, HDFC, భారతీ ఎయిర్‌టెల్, L&T, ITC కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాయి. ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఇన్ఫోసిస్, ఆర్‌ఐఎల్, భారతీ ఎయిర్‌టెల్ గత 27 నెలల్లో నిలకడగా టాప్ 10 హోల్డింగ్స్‌లో ఉన్నాయి.

ప్రైవేట్ బ్యాంకులు
మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువగా ప్రైవేట్ బ్యాంకులకు వేయిటేజ్ ఇచ్చాయి. సెప్టెంబర్ లో ప్రైవేట్ బ్యాంకులకు 18.2 శాతం అలోకేషన్ ఇచ్చాయి. వీటి తర్వాత టెక్నాలజీ 9.8 శాతం, ఆటో 7.8 శాతం, NBFC 7.7శాతం, కన్స్యూమర్ 7.1 శాతంగా ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్ పోర్ట్ ఫోలియోల్లో హెల్త్‌కేర్ స్టాక్‌ల అలోకేషన్ పెరిగాయి. వీటిలో పెట్టుబడి 6.6 శాతానికి చేరింది. మ్యూచువల్ ఫండ్స్ చమురు, గ్యాస్ స్టాక్‌లపై బేరిష్‌గా ఉన్నాయి.
Note: ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే ఇచ్చింది. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి అధిక రిస్క్ తో కూడింది. ఇందులో పెట్టుబడి పెట్టేముందు నిపుణులు సంప్రదించగలరు.


Click it and Unblock the Notifications