Adani: జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంపై AAR తీర్పు.. GST విషయంలో అదానీ గ్రూపునకు బిగ్ రిలీఫ్
Adani: జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయ కార్యకలాపాలను అదానీ గ్రూపునకు బదిలీ చేస్తే వస్తు సేవల పన్ను (GST) నుంచి మినహాయింపు ఉంటుందని అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్(AAR) తెలిపింది. ఈ మేరకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) లేవనెత్తిన ప్రశ్నకు సమాధానమిచ్చింది. ఈ వ్యాపార బదిలీ 'గోయింగ్ కన్సర్న్'గా పరిగణించబడుతుందా లేదా GST విధించబడుతుందా అనే క్లారిటీ కోసం AAR రాజస్థాన్ బెంచ్ ను AAI సంప్రదించింది. ఇప్పుడు ఈ విషయంపై స్పష్టత లభించింది.
"వ్యాపారాన్ని మొత్తంగా లేదా స్వతంత్ర భాగంగా బదిలీ చేయడం అనేది GST చట్టం ప్రకారం సేవగా పరిగణించబడుతుంది. అలాంటి లావాదేవీలకు వస్తు, సేవల పన్ను నుంచి మినహాయింపు ఉంటుంది. దరఖాస్తుదారు (AAI) మరియు అదానీ జైపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ మధ్య జనవరి 16, 2021న రాయితీ ఒప్పందం కుదిరింది. దీనిని 'గోయింగ్ కన్సర్న్'గానే భావిస్తున్నాం" అని మార్చి 20, 2023 నాటి తీర్పులో AAR పేర్కొంది.

అదానీ గ్రూప్ అక్టోబర్, 2021లో జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం కార్యకలాపాలు, నిర్వహణ, అభివృద్ధి బాధ్యతలను AAI నుంచి తీసుకుంది. ఈ ఎయిర్ పోర్టుని భారత ప్రభుత్వం 50 ఏళ్లపాటు లీజుకు ఇచ్చింది. AAR రాజస్థాన్ బెంచ్ 2021 మరియు 2022లో, గుజరాత్ మరియు ఉత్తరప్రదేశ్ బెంచ్ లు కూడా AAI మరియు స్పెషల్ పర్పస్ వెహికల్ (SPV) మధ్య వ్యాపార ఒప్పందాలు గోయింగ్ కన్సర్న్ కింద బదిలీ పరిధిలోకి వస్తాయని తీర్పునిచ్చాయి.
అయితే అదానీ జైపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ నుంచి సిబ్బంది వేతనాల ఖర్చు రీయింబర్స్ మెంట్ కోసం AAI జనరేట్ చేసిన బిల్లు మ్యాన్ పవర్ పరిధిలోకి వస్తుందని దానిపై GST క్రింద 18 శాతం పన్ను విధించబడుతుందని AAR స్పష్టం చేసింది. ఈ తీర్పు దేశంలోని ఇతర ప్రాంతాల్లో AAI ద్వారా జరిపిన ఇతర బదిలీలకు బలమైన పునాదిగా నిలుస్తుందని AMRG & అసోసియేట్స్ సీనియర్ పార్టనర్ రజత్ మోహన్ తెలిపారు.


Click it and Unblock the Notifications