Reliance: తాజాగా అనేక కంపెనీలు తమ త్రైమాసిక ఫలితాలను వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అంచనాలను అందుకోవటంలో మిస్ అయ్యింది. అయితే కేంద్ర ప్రభుత్వం విండ్ ఫాల్ టాక్స్ వల్ల లాభాలు తగ్గాయి. అయితే ఇటీవల కొన్నినెలల కిందట ముఖేష్ అంబానీ నుంచి బాధ్యతలు అందుకున్న వారసులు ఆకాష్ అంబానీ, ఇషా అంబానీలు తండ్రికి గట్టి పోటీగా నిలిచారు.

రిలయన్స్ లాభాలు..
రిలయన్స్ ఇండస్ట్రీస్ తన సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాల వెలువడ్డాయి. లాభాలు గత సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే 0.2 శాతం క్షీణించాయి. రెండవ త్రైమాసికంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.13,656 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఈ కాలంలో కంపెనీ ఆదాయం 34 శాతం పెరిగి రూ.2.32 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది నిపుణుల అంచనాల కంటే ఎక్కువ కావటం గమనార్హం.

రిలయన్స్ రిటైల్..
తండ్రి నుంచి రిలయన్స్ రిటైల్ పగ్గాలు అందుకున్న ఇషా అంబానీ అనతి కాలంలోనే కంపెనీని మంచి లాభాల బాట పట్టించారు. వ్యాపార నిర్వహణ విషయంలో తండ్రి ముఖేష్ కు ఏమాత్రం తగ్గకుండా విజయవంతంగా ముందుకు సాగుతున్నారు ఆమె. రిలయన్స్ రిటైల్ సెప్టెంబర్ త్రైమాసిక లాభం 36 శాతం పెరిగి రూ.2,305 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.1,695 కోట్లుగా ఉంది. ఇదే సమయంలో రిలయన్స్ రిటైల్ ఆదాయం 42.8 శాతం పెరిగి రూ.64,936 కోట్లకు చేరుకుంది. ఇది గతంలో కంటే దాదాపు రూ.20,000 కోట్లు అధికం. నూతన సాంకేతికతతో కస్టమర్లకు కంపెనీ చేరువవుతోంది.

రిలయన్స్ జియో..
4Gతో అరంగేట్రం చేసి స్వదేశీ టెక్నాలజీతో 5Gకి విస్తరించింది రిలయన్స్ జియో. దేశ టెలికాం రంగంపై జియోది చెరగని ముద్ర. దీని బాధ్యతలు అందుకున్న ఆకాష్ అంబానీ కంపెనీలు అద్బుతమైన లాభాల్లో నడిపిస్తున్నారు. సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసికంలో రిలయన్స్ జియో లాభం ఏడాది ప్రాతిపదికన 28 శాతం పెరిగింది. రిలయన్స్ జియో గత సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.3,528 కోట్ల లాభాన్ని నమోదు చేయగా.. ఇప్పుడు రూ.4,518 కోట్ల లాభాన్ని ఆర్జించింది. రిలయన్స్ జియో ఆదాయం ఏడాది ప్రాతిపదికన 20 శాతం పెరిగి రూ.22,521 కోట్లకు చేరుకుంది.

జియో 5G WiFi సర్వీసెస్..
జియో ఛైర్మన్ ఆకాష్ అంబానీ జియో ట్రూ 5G పైలట్ బీటా ట్రయల్‌ను చెన్నై, నాథ్‌ద్వారా నగరాల్లో ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. విద్యా సంస్థలు, మతపరమైన ప్రదేశాలు, రైల్వే స్టేషన్‌లు, బస్టాండ్‌లు, వాణిజ్య కేంద్రాలతో పాటు ఎక్కువ మంది ప్రయాణించే ప్రాంతాల్లో జియో 5G వైఫై సేవలను ప్రారంభిస్తున్నట్లు ఆకాష్ అంబానీ అక్టోబర్ 22న ప్రకటించారు.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications