ఆధార్, పాన్ కార్డ్ లింక్ గురించి ఆదాయపు పన్ను శాఖ (CBDT) కీలకమైన గడువును ప్రకటించింది. ఈ గడువు ముగిస్తే.. మీ పాన్ కార్డ్ కేవలం ఒక ప్లాస్టిక్ ముక్కగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. ఆధార్ పాన్ లింక్ (aadhar pan card link) ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) తాజా నోటిఫికేషన్ ప్రకారం.. 31 డిసెంబర్ 2025 లోపు ఆధార్, పాన్ ను లింక్ చేయాలి. ఒకవేళ మీరు ఈ గడువులోపు ఆధార్ పాన్ లింక్ (aadhar pan card link) పూర్తి చేయకపోతే.. 1 జనవరి 2026 నుండి మీ పాన్ కార్డ్ 'ఇన్-ఆపరేటివ్' (Inoperational) గా మారుతుంది. అంటే ఆ తర్వాత మీరు ఎటువంటి ఆర్థిక లావాదేవీలు లేదా ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయలేరు.

గడువు పొడిగింపు.. జరిమానా వివరాలు..
గతంలో ప్రభుత్వం ఈ గడువును పలుమార్లు పొడిగించింది (జూన్ 2023 నుండి మే 2024 వరకు). ఇప్పుడు ఇచ్చిన డిసెంబర్ 2025 గడువు చివరి అవకాశం అని ట్యాక్స్ నిపుణులు చెబుతున్నారు. మీరు గడువు లోపు లింక్ చేయకపోతే.. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 234H ప్రకారం రూ. 1,000 లేట్ పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. పన్ను చెల్లింపుదారుల గుర్తింపును ధృవీకరించడానికి, నకిలీ పాన్ కార్డులను నిరోధించడానికి ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది.
ఆన్‌లైన్‌లో లింక్ చేయడం ఎలా?
మీరు ఇంట్లోనే కూర్చుని ఐదు నిమిషాల్లో ఆదార్ పాన్ లింక్ (aadhar pan card link) ప్రక్రియను పూర్తి చేయవచ్చు..
- ముందుగా ఆదాయపు పన్ను శాఖ అధికారిక పోర్టల్ (incometax.gov.in/iec/foportal)లోకి వెళ్లాలి.
- అక్కడ హోమ్ పేజీలో 'Link Aadhaar' ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
- మీ పాన్ నంబర్, ఆధార్ నంబర్ వివరాలను నమోదు చేయండి.
- మీ ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్‌కు వచ్చే OTPని ఎంటర్ చేసి వెరిఫై చేయండి.
- సబ్మిట్ చేసిన తర్వాత ఒకట్రెండు రోజుల్లో మీ స్టేటస్ అప్‌డేట్ అవుతుంది. ఒకవేళ ముందే లింక్ చేసి ఉంటే ఆల్రెడీ లింక్డ్ అని వస్తుంది.
లింక్ చేయకపోతే వచ్చే సమస్యలు ఏంటి?
మీ పాన్ కార్డ్ పని చేయకపోతే మీరు ఎదుర్కోవాల్సిన ప్రధాన ఇబ్బందులు ఇవే..
- మీరు ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ (ITR) ఫైల్ చేయలేరు.
- పెండింగ్‌లో ఉన్న ట్యాక్స్ రీఫండ్స్ రావు.
- బ్యాంక్ ఖాతా తెరవాలన్నా లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేయాలన్నా ఇబ్బందులు ఎదురవుతాయి.
- రూ. 50,000 కంటే ఎక్కువ నగదు లావాదేవీలు చేయడం సాధ్యం కాదు.
- అధిక రేటుతో TDS (Tax Deducted at Source) కట్ అవుతుంది.
పారదర్శకతే ప్రభుత్వ లక్ష్యం
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశ్యం పారదర్శకత. ప్రతి పన్ను చెల్లింపుదారుని ఖచ్చితమైన వివరాలను సేకరించడం ద్వారా ఆర్థిక మోసాలను అరికట్టవచ్చని CBDT భావిస్తోంది. ఆదార్ పాన్ (aadhar pan card link) చేయడం వల్ల ప్రభుత్వానికి ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ సులభం అవుతుంది. మీరు ఇప్పటికే లింక్ చేసి ఉంటే ఒకసారి పోర్టల్‌లో చెక్ చేసుకోవడం ఉత్తమం.
సమయం మించిపోకముందే మేల్కొండి!
చాలామంది చివరి నిమిషం వరకు వేచి చూసి.. సర్వర్ సమస్యల వల్ల ఇబ్బంది పడుతుంటారు. చివరి రోజుల్లో వెబ్‌సైట్ పై ఒత్తిడి పెరిగి లింక్ అవ్వడం కష్టమవ్వచ్చు. కాబట్టి రూ. 1,000 జరిమానా భారాన్ని తప్పించుకోవడానికి అలాగే మీ ఆర్థిక లావాదేవీలు సాఫీగా సాగడానికి వెంటనే మీ పాన్-ఆధార్ అనుసంధానాన్ని పూర్తి చేయండి. డిసెంబర్ 31 తర్వాత నిబంధనలు మరింత కఠినంగా ఉండే అవకాశం ఉంది.
More From GoodReturns

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్‌డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications