Aadhar News: ఆధార్ ఉచిత అప్‌డేట్‌కు ముంచుకొస్తున్న గడువు.. ఆ రోజే లాస్ట్ డేట్.. సమయం లేదు మిత్రమా..
Aadhar free update: దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే ఏ పథకానికైనా ఆధార్ కార్డు తప్పనిసరి ధ్రువపత్రంగా మారిపోయింది. బయోమెట్రిక్, ఐరిస్ తో పాటు చిరునామా, మొబైల్ నంబర్ సహా అన్ని పూర్తి వివరాలు ఒకేచోట సమర్పించగలిగే అవకాశం కల్పిస్తోంది. అందుకే దీని ప్రాముఖ్యతను గుర్తించిన కేంద్రం.. ప్రతి 10 ఏళ్లకు తప్పనిసరిగా ఆధార్ అప్‌డేట్ చేసుకోవాలని నిబంధన విధించింది.
ఆధార్ కార్డులు జారీ చేయబడి 10 ఏళ్లు పూర్తైన వారు గుర్తింపు మరియు చిరునామా పత్రాలతో తమ వివరాలను రీవాలిడేషన్ చేయించుకోవాలి. ఇందుకోసం ఉచితంగా ఆధార్ అప్‌డేట్ చేయించుకునేందుకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) అవకాశం కల్పించింది. ఇప్పటికే ఎన్నోసార్లు గడువు తేదీని పొడిగిస్తూ వచ్చి, ఎట్టకేలకు సెప్టెంబర్ 14 చివరి తేదీగా నిర్ణయించింది. దీనికి సుమారు వారం రోజులే సమయం ఉండటంతో ప్రజలు త్వరపడాలని కోరుతోంది.

ఉచిత ఆధార్ అప్‌డేట్ గడువు ముగిసిన తర్వాత ఏదైనా వివరాల మార్పుల కోసం UIDAI 50 చొప్పున రుసుమును వసూలు చేస్తుంది. కాగా ఈ ఉచిత సేవ ప్రత్యేకంగా 'myAadhaar' పోర్టల్ ద్వారా అందుబాటులో ఉంటుందని చెబుతోంది. ఆధార్ నంబర్ ఎంటర్ చేసి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చే OTP ద్వారా లాగిన్ కావాలి. తరువాత కనిపించే ప్రొఫైల్ పేజీలో ఉన్న గుర్తింపు మరియు చిరునామా వివరాలు సరైనవని భావిస్తే ధ్రువీకరించాల్సి ఉంటుంది.
ఒకవేళ ఏవైనా వివరాలు తప్పుగా ఉంటే అందుబాటులోని ఇతర గుర్తింపు మరియు చిరునామా పత్రాలను ఎంచుకుని వాటి ఆధారంగా తప్పులను సరిదిద్దుకోవాలి.
ఎంచుకున్న పత్రాలను అప్‌లోడ్ చేసిన అనంతరం రివ్యూ చేసి, సమ్మతిని తెలియజేయండి. ఈ ప్రాసెస్‌లో ఏవిధమైన సమస్య ఎదురైనా 1947 నంబర్‌కు కాల్ చేసి UIDAI ఏజెంట్ సహాయం తీసుకోవచ్చు.


Click it and Unblock the Notifications