aadhar: దేశంలో ప్రతి ఒక్కరికీ ఆధార్ తప్పనిసరైంది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నుంచి ఏ పని జరగాలన్నా ధృవీకరణ కోసం దీనినే ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఒకవేళ ఏవైనా తప్పులు దొర్లినా సులభంగా సరిచేయించుకునే వీలుండటం వల్ల ఇది అత్యంత ప్రజాధరణ పొందింది. బతికి ఉన్న ప్రజలకు సరే, మరి వ్యక్తి మరణించిన పక్షంలో వారి ఆధార్ ఏమౌతుంది ?

నిబంధనలు రూపొందుతున్నాయ్..
మరణించిన వ్యక్తుల ఆధార్ కార్డులను డీయాక్టివేట్ చేయడానికి త్వరలోనే ఓ కొత్త విధానం అమల్లోకి రానుంది. ఈ మేరకు యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) మరియు రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా కలిసి విధివిధానాలు రూపొందిస్తున్నట్లు ప్రముఖ మీడయా సంస్థ తెలిపింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో దీన్ని తయారు చేయనున్నట్లు వెల్లడించింది.

మరణ ధృవీకరణకూ..
చనిపోయిన వారి సమాచారాన్ని ఆయా వ్యక్తుల కుటుంబ సభ్యులు ధృవీకరించాల్సిన విధంగా ఈ విధానం రూపొందుతున్నట్లు తెలుస్తోంది. వారి అనుమతితో మాత్రమే డీయాక్టివేషన్ జరుగుతుందని మీడియా నివేదిక పేర్కొంది. జనన ధృవీకరణ పత్రంలో ఇప్పటికే ఆధార్ లింకింగ్ జరుగుతుండగా.. మరణ పత్రంలోనూ దీన్ని అనుసరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఆధార్ నంబర్ల డీయాక్టివేషన్ మాత్రం ఇప్పటి వరకు అందుబాటులో లేదు.

త్వరగా అప్ డేట్ చేసుకోండి:
ప్రస్తుత చట్టం ప్రకారం ఆధార్ తీసుకున్న కనీసం 10 ఏళ్లకు ఒకసారి సపోర్టింగ్ పత్రాల ద్వారా ఆయా వివరాలను అప్ డేట్ చేయాల్సి ఉంటుంది. ఇదే విషయంపై పౌరులను UIDAI ఇటీవల అప్రమత్తం చేసింది. ఇందుకోసం మార్చి 15 నుంచి జూన్ 14 వరకు రుసుము చెల్లించకుండా వివరాలు అప్ డేట్ చేసుకునే అవకాశం కల్పించింది. కానీ రెటీనా, వేలిముద్ర, ఫొటోను ఆధార్ నమోదు కేంద్రాల్లో చేసుకోవాల్సి ఉండగా.. మిగతా వాటికి ఆన్ లైన్ ఆప్షన్ అందుబాటులో ఉంది.


Click it and Unblock the Notifications