యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఆధార్ కార్డు డిజైన్ మార్చబోతోంది. డేటా దుర్వినియోగాన్ని అరికట్టడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు చెప్తు్న్నారు. దీనికి సంబంధించిన కొత్త నిబంధనలను డిసెంబర్ నెలలో ప్రవేశపెట్టాలని UIDAI ప్లాన్ చేస్తోంది. ఈ కొత్త కార్డు ఎలా ఉండబోతుందంటే..

కొత్తగా రూపొందించే ఆధార్ కార్డుపై కేవలం ఫోటో, క్యూఆర్ కోడ్ (QR Code) మాత్రమే ఉంటాయట. కార్డులో పేరు, చిరునామా, 12 -అంకెల ఆధార్ నంబర్ వంటి వ్యక్తిగత వివరాలు ఇకపై కనిపించవు. కార్డుపై అన్ని వివరాలు ఉండడం వల్ల డేటా ఎక్కువగా దుర్వినియోగం అవుతుందని అధికారులు అంటున్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్తున్నారు.
ఇకపై ఫుల్ సేఫ్టీ
కొత్త కార్డు డిజైన్‌లో మొత్తం సమాచారం QR కోడ్‌లో సురక్షితంగా నిల్వ చేయబడుతుంది. దీనిని సరైన ధృవీకరణ మార్గాల ద్వారా మాత్రమే పొందగలం. దీనివల్ల ఆధార్ డీటెయిల్స్ మరింత సేఫ్ గా ఉంటాయి. డేటా దుర్వినియోగం అయ్యే అవకాశం తగ్గుతుంది. ఇప్పటికే హోటళ్ల వంటి సంస్థలు ఆధార్ నంబర్లను, బయోమెట్రిక్ డేటాను అనధికారంగా సేకరిస్తున్నాయి. ఇలాంటి వాటికి ఇకపై అవకాశం ఉండదు. ఇకనుంచి ఆధార్ ను డాక్యుమెంట్ లా కాకుండా కేవలం వెరిఫికేషన్ కోసం మాత్రమే వాడేలా ఈ కొత్త డిజైన్ ఉండబోతోంది.
కొత్త ఆధార్ యాప్ కూడా..
ఇకపోతే త్వరలోనే కొత్త ఆధార్ యాప్ (New Aadhaar App) కూడా రాబోతుందని సమాచారం. ప్రస్తుతం ఉన్న mAadhaar అప్లికేషన్ స్థానంలో కొత్త ఆధార్ యాప్‌ను రానుంది. ఇందులో మరిన్ని కొత్త ఫీచర్లు ఉంటాయి. ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా యాప్ ఓపెన్ అవుతుంది. యూజర్లు తమ ప్రైవసీని కాపాడుకుంటూ అవసరమైన సమాచారాన్ని మాత్రమే ఎంపిక చేసి పంచుకునే అవకాశం ఉంటుంది. అలాగే అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్లను నేరుగా యాప్ ద్వారా అప్‌డేట్ చేసుకోవచ్చు. మొబైల్ లేని కుటుంబ సభ్యులను కూడా యాప్‌లో యాడ్ చేయొచ్చు. ఫేస్ అథెంటికేషన్ ను ఉపయోగించి మొబైల్ నెంబర్ ఈజీగా అప్‌డేట్ చేసుకోవచ్చు.
బోలెడు బెనిఫిట్స్
ఈ కొత్త ఆధార్ అప్ డేట్ (aadhar card update) యాప్ ఎయిర్‌పోర్ట్‌లలో ఉపయోగించే డిజియాత్రా (DigiYatra) సిస్టమ్ తరహాలో పనిచేస్తుంది. అంటే డైలీ లైఫ్ లో జరిగే రకరకాల వెరిఫికేషన్ ప్రక్రియలను వేగంగా సురక్షితంగా మారుస్తుంది. ఉదాహరణకు ఈవెంట్స్, సినిమా హాల్స్‌లో ఎంట్రీ. హోటల్ చెక్-ఇన్‌లు, స్టూడెంట్ వెరిఫికేషన్ వంటివి ఇకపై ఈజీగా జరిగిపోతాయి. ఈ కొత్త కార్డు అందుబాటులోకి వస్తే.. ఇకనుంచి ఫిజికల్ గా ఆధార్ కార్డుని లేదా జిరాక్స్ కాపీని క్యారీ చేయాల్సిన అవసరం ఉండదు.


Click it and Unblock the Notifications