NPS News: ఏప్రిల్ 1 నుంచి NPSలో కొత్త మార్పు.. అకౌంట్స్ భద్రత కోసం PFRDA కీలక ఫీచర్
New NPS rule: రిటైర్‌మెంట్ అనంతర జీవితం ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా కొనసాగించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన స్కీమ్ నేషనల్ పెన్షన్ స్కీమ్(NPS). యుక్త వయసులో ఉన్నప్పుడు ప్రతినెలా కొంత మొత్తం సేవ్ చేసుకుని దాన్ని జీవిత చరమాంకంలో వినియోగించుకునే అవకాశం కల్పించింది. అయితే పెరుగుతున్న సాంకేతికత వల్ల ఈ డేటా అక్రమార్కుల చేతిలో పడకుండా కీలక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)లో పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) కొత్త భద్రతా ప్రమాణాలను ప్రవేశపెట్టింది. ఏప్రిల్ 1 నుంచి ఇది అమలులోకి వచ్చింది. కేవలం సాధారణ లాగిన్‌కు అదనంగా రెండు అంచెల ఆధార్-ఆధారిత ప్రమాణీకరణ వ్యవస్థను కొత్తగా అనుసంధానించింది. NPS ఖాతాలోనికి లాగిన్ అయ్యే పాస్‌వర్డ్ ఆధారిత వినియోగదారులందరికీ దీన్ని తప్పనిసరి చేసింది.

'CRA సిస్టమ్‌ను యాక్సెస్ చేయడంలో భద్రతా చర్యలను మెరుగుపరచాలని భావించాం. చందాదారులు మరియు వాటాదారుల ప్రయోజనాలను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం. అందుకే CRA సిస్టమ్‌లోనికి లాగిన్ చేయడానికి ఆధార్ ఆధారిత ప్రమాణీకరణ ద్వారా అదనపు భద్రతా ప్రమాణాలను అమల్లోకి తీసుకువచ్చాం' అని PFRDA ఒక నోటిఫికేషన్‌లో తెలిపింది.
వినియోగదారులు తమ NPS ఖాతాలో లాగిన్ కావడానికి మొదట https://enps.nsdl.com/eNPS/NationalPensionSystem.html వెబ్‌సైట్‌ని సందర్శించాలి. 'PRAIN/IPINతో లాగిన్'కి వెళ్లి యూజర్ ID మరియు పాస్‌వర్డ్‌ను నమోదు చేయాలి. Captcha ఎంటర్ చేసిన అనంతరం ఆధార్ ప్రమాణీకరణ విండో ప్రాంప్ట్ వచ్చి, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP పంపబడుతుంది. దానిని అక్కడ నమోదు చేయాల్సి ఉంటుంది. తద్వారా వినియోగదారులు NPS ఖాతాను యాక్సెస్ చేయవచ్చు.


Click it and Unblock the Notifications