Aadhar 2.0: ఆధార్ 2.0 వచ్చేస్తోంది! కార్డుపై ఇక మీ పేరు, అడ్రస్ కనిపించవు.. కేవలం ఫోటో మాత్రమే!

మనం ఎక్కడికి వెళ్లినా గుర్తింపు కార్డుగా ఆధార్‌నే వాడుతుంటాం. అయితే, ఆధార్ కార్డుపై ఉండే మన పేరు, అడ్రస్, పుట్టిన తేదీ వంటి వివరాలు ఇతరులకు సులభంగా తెలిసిపోతున్నాయని చాలా కాలంగా ఆందోళన ఉంది. ఈ సమస్యకు చెక్ పెడుతూ కేంద్ర ప్రభుత్వం కొత్త ఆధార్ (Aadhar 2.0) పేరుతో ఒక భారీ మార్పుకు శ్రీకారం చుట్టబోతున్నట్లు మీడియా కథనాలు చెబుతున్నాయి. డిసెంబర్ నెల నుంచి ఈ కొత్త కార్డులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Aadhar 2 0 New Card December Launch UIDAI Privacy Features QR Code Verification

పాత కార్డుకు, కొత్త కార్డుకు తేడా ఏంటి?

ప్రస్తుతం మన దగ్గర ఉన్న ఆధార్ కార్డుపై పేరు, ఆధార్ నంబర్, తండ్రి పేరు, అడ్రస్, పుట్టిన తేదీ అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. కానీ (Aadhar 2.0) లో ఈ వివరాలేవీ నేరుగా కార్డుపై ప్రింట్ చేయబడవు.

  • ఏమి ఉండవు: పేరు, ఆధార్ నంబర్, చిరునామా, పుట్టిన తేదీ, జెండర్ వివరాలు కార్డుపై కనిపించవు.
  • ఏమి ఉంటుంది: కార్డుపై కేవలం మీ ఫోటో మాత్రమే కనిపిస్తుంది.

ఈ మ్యాజిక్ ఎలా జరుగుతుంది? (సెక్యూర్ QR కోడ్)

మీ వివరాలన్నీ కార్డుపై కనిపించకపోతే మరి గుర్తు పట్టడం ఎలా? అని మీకు అనుమానం రావచ్చు. అక్కడే అసలైన టెక్నాలజీ ఉంది. కొత్త కార్డులో ఒక శక్తివంతమైన QR కోడ్ ఉంటుంది. మీ పేరు, అడ్రస్, బయోమెట్రిక్ డేటా వంటి కీలక వివరాలన్నీ ఈ కోడ్‌లో ఎన్‌క్రిప్టెడ్ (Encrypted) రూపంలో దాగి ఉంటాయి. అంటే సాధారణంగా చూస్తే ఎవరికీ ఏమీ అర్థం కాదు.

ప్రయోజనం ఏంటి?

మనం హోటళ్లలో స్టే చేసినప్పుడు లేదా ఆఫీసుల్లో జాయిన్ అయినప్పుడు ఆధార్ కార్డు జిరాక్స్ ఇస్తుంటాం. దీనివల్ల మన వ్యక్తిగత సమాచారం ఇతరుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. కానీ కొత్త ఆధార్ కార్డుతో ఆ భయం ఉండదు.

  • జిరాక్స్ తీసినా వేస్టే: కార్డుపై వివరాలు ఉండవు కాబట్టి జిరాక్స్ కాపీ ద్వారా ఎవరూ మీ డేటాను దొంగిలించలేరు.
  • అధికారిక వెరిఫికేషన్: ప్రభుత్వం అనుమతించిన స్కామర్లు లేదా UIDAI యాప్స్ ద్వారా మాత్రమే ఆ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి వివరాలు చూడగలరు.

ఫేస్ అథెంటికేషన్ (AI టెక్నాలజీ)

కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద గారు లోక్‌సభలో తెలిపిన వివరాల ప్రకారం.. ఆధార్ డేటా అంతా భారతదేశంలోని సర్వర్లలోనే భద్రంగా ఉంది. ఈ కొత్త వెర్షన్‌లో AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) మరియు మెషిన్ లెర్నింగ్ ఆధారిత 'ఫేస్ అథెంటికేషన్' సౌకర్యాన్ని కూడా మెరుగుపరుస్తున్నారు. దీనివల్ల వేలిముద్రలు సరిగ్గా పడకపోయినా, మొహాన్ని స్కాన్ చేయడం ద్వారా సులభంగా వెరిఫికేషన్ పూర్తి చేయవచ్చు.

ఆధార్ 2.0 - ముఖ్యమైన అంశాలు

• గోప్యత: కేవలం ఫోటో మాత్రమే కనిపిస్తుంది, మిగతా వివరాలన్నీ రహస్యంగా ఉంటాయి.
• QR కోడ్: డేటా మొత్తం ఎన్‌క్రిప్ట్ చేయబడి ఉంటుంది.
• భద్రత: కేవలం అధీకృత సంస్థలు మాత్రమే డేటాను చూడగలవు.
• టెక్నాలజీ: AI ఆధారిత ఫేస్ అథెంటికేషన్ ఉపయోగించబడుతుంది.

ప్రస్తుతం దేశంలో సుమారు 134 కోట్ల మంది ఆధార్ కార్డు వినియోగదారులు ఉన్నారు. ఇంత భారీ వ్యవస్థలో భద్రతను పెంచేందుకు ఆధార్ (Aadhar 2.0) ఒక విప్లవాత్మక అడుగు అని చెప్పవచ్చు. దీనిపై ప్రభుత్వం నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+