ఒక ఆధార్ కార్డు ఆధారంగా ఎన్ని పనులు చేస్తామో చెప్పక్కర్లేదు. కానీ, ఏదైనా చిన్న అప్డేట్ చేయాలన్నా కేంద్రంలోకి వెళ్లాలి, లైన్‌లో నిలబడాలి, డాక్యుమెంట్లు తీసుకెళ్లాలి. అయితే, ఈ కష్టాలన్నిటికీ త్వరలో ముగింపు ఉండబోతోంది.

UIDAI ఇప్పుడు ఓ కొత్త మెరుగుదల తీసుకొస్తోంది. QR కోడ్ ఆధారిత e-Aadhaar సిస్టమ్ మరియు అప్‌డేట్ చేయగలిగే మొబైల్ యాప్. ఇకనుండి పేరు, అడ్రస్, పుట్టిన తేది ఫోన్ నుంచే మార్చొచ్చు
UIDAI త్వరలోనే ఒక కొత్త ఆధార్ మొబైల్ యాప్‌ను లాంచ్ చేయనుంది. దీని ద్వారా మీరు మీ పేరు, అడ్రస్, పుట్టిన తేదీ లాంటి వ్యక్తిగత వివరాలను నేరుగా మొబైల్ ఫోన్ నుంచే మార్చుకోవచ్చు. ఇక వాటి కోసం కేంద్రాల చుట్టూ తిరుగనవసరం లేదు.
UIDAI తెలిపిన ప్రకారం, 2025 నవంబర్ తర్వాత కేవలం fingerprint, eye scan లాంటి బయోమెట్రిక్ వివరాల మార్పులకు మాత్రమే సెంటర్‌కు వెళ్లాల్సి ఉంటుంది. మిగతా అన్నీ పేరు మార్పు, అడ్రస్ అప్‌డేట్, వయస్సు, లింగం లాంటి విషయాలన్నీ యాప్ నుంచే పూర్తయ్యేలా చేస్తారు.
ఆధార్ యాప్‌తో కలిగే ముఖ్య ప్రయోజనాలు:
ఇకమీదట ఆధార్ డిటెయిల్స్ మార్చుకోవడం చాలా సులభం కానుంది. మొబైల్ ఫోన్ నుంచే మీరు మీ పేరు, అడ్రస్, పుట్టిన తేదీ వంటి వివరాలు మార్చుకోవచ్చు. దీనితో పాటు పేపర్లు తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా, మొత్తం ప్రక్రియ డిజిటల్ రూపంలో జరుగుతుంది. చాలా సందర్భాల్లో డాక్యుమెంట్‌లు అప్లోడ్ చేయాల్సిన అవసరమే ఉండదు. మీరు ఇచ్చిన అనుమతితోనే ఆధార్ వివరాలు ఇతరులకి కనిపిస్తాయి, కాబట్టి ప్రయివసీ పరిరక్షణ కూడా ఉంటుంది. అంతేకాదు, హోటళ్లు లేదా ప్రయాణాల సమయంలో ఆధార్ కార్డ్ ఫొటోకాపీ అవసరం లేకుండా, కేవలం QR కోడ్ స్కాన్ చేస్తే చాలు గుర్తింపు పూర్తవుతుంది.
మీ వివరాలను అప్‌డేట్ చేయాలంటే మీ దగ్గర డాక్యుమెంట్లు తిసుకెళ్లాల్సిన అవసరం లేకుండా బర్త్ సర్టిఫికేట్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, MNREGA లేదా పవర్ బిల్ వంటి ప్రభుత్వ రికార్డుల ద్వారా UIDAI డేటాను ధృవీకరించనుంది.
పిల్లల ఆధార్ అప్‌డేట్:
UIDAI ప్రత్యేకంగా పిల్లల కోసం బయోమెట్రిక్ అప్‌డేట్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ముఖ్యంగా 5-7 సంవత్సరాలు మరియు 15-17 సంవత్సరాల మధ్య ఉండే పిల్లల వివరాలు అప్‌డేట్ చేయడం కోసం CBSE లాంటి విద్యా బోర్డులతో కలిసి స్కూళ్లలోనే ఆధార్ అప్డేట్ క్యాంపులు పెడుతున్నారు.
QR కోడ్‌తో ఆధార్ వెరిఫికేషన్:
మీ ఆధార్ కార్డ్‌ను ఎక్కడైనా ప్రూఫ్‌గా ఇవ్వాల్సి వస్తే ఇకపై ఫొటోకాపీ, జీరోక్స్ అవసరం లేదు. కొత్త e-Aadhaar QR కోడ్ స్కాన్ చేస్తే చాలు. మీ గుర్తింపు కచ్చితంగా ధృవీకరించబడుతుంది.
ప్రస్తుతం దాదాపు 2,000 Aadhaar డివైస్‌లు ఇప్పటికే ఈ కొత్త QR సిస్టమ్‌తో అప్‌గ్రేడ్ అయ్యాయి. రెస్టారెంట్లు, సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఈ వెరిఫికేషన్‌ను ఇప్పటికే పరీక్షిస్తున్నారు.
ఇకపై ఆధార్ అప్డేట్లు పెద్ద పని కావు. మీ ఫోన్‌లోనే మీ పేరు, అడ్రస్ మార్చొచ్చు. పేపర్లు, కాపీలు, క్యూలైన్లు అన్నీ తగ్గిపోతాయి. ఇది ముఖ్యంగా వృద్ధులు, విద్యార్థులు, తరచూ మారే చిరునామా ఉన్నవారికి పెద్ద ఉపశమనం.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..



Click it and Unblock the Notifications