ఏ వ్యక్తి అయినా తన గుర్తింపును సాక్ష్యంగా చూపాలంటే, ఆధార్ కార్డు ఇక తప్పనిసరి. ప్రభుత్వ స్కీములు నుంచి బ్యాంకింగ్ వరకూ ప్రతి దశలో ఆధార్ అవసరం అయ్యే రోజుల్లో, ఐడెంటిటీని తప్పుగా వాడేవారికి చెక్ పెట్టేందుకు UIDAI (యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) కొత్త నియమాలు తీసుకువస్తోంది.
ఇప్పటిదాకా ఆధార్ పొందడం, అప్డేట్ చేయడం సులువుగానే ఉండేది. కొన్ని పత్రాలు ఇచ్చినా చాలు, కొన్ని చోట్ల సైతం వెరిఫికేషన్ సడలింపుతో జరిగేది. కానీ ఇప్పుడు డేటా ఆధారంగా, సిస్టమాటిక్ వెరిఫికేషన్ తీసుకువచ్చే దిశగా UIDAI ముందడుగు వేసింది.

కొత్తగా ఏం మారబోతుందంటే...
1. ఆధార్ తీసుకునే ప్రతి వ్యక్తి డేటా, డాక్యుమెంట్స్ ప్రభుత్వ డేటాబేస్‌లతో వెరిఫై అవ్వాలి. అంటే మీరు ఆధార్ కోసం ఇచ్చే పాస్‌పోర్ట్, పాన్ కార్డు, రేషన్ కార్డు వంటి పత్రాలు అవి నిజమేనా లేదా అన్నదానిపై పూర్తిగా తనిఖీ జరుగుతుంది.
2. ఆధార్ అప్డేట్ చేయాలన్నా ఇప్పుడు కఠినమే. ఒకవేళ చిరునామా మారితే లేదా పుట్టిన తేదీ మారిస్తే కేవలం ఋజువులతో చెల్లదన్నమాట. ఆధారాలు ప్రభుత్వ రికార్డుల్లో క్రాస్ వెరిఫికేషన్ చేయబడతాయి.
3. ఒక్కో వ్యక్తికి ఒక్క ఆధార్ మాత్రమే ఉండాలి. ఇది తప్పనిసరి నిబంధన. అంటే డూప్లికేట్ ఆధార్‌లు ఉంటే రద్దు చేసే ప్రక్రియ మొదలవుతుంది. ఇది దేశంలో నకిలీ గుర్తింపులను పూర్తిగా తుడిచివేసేందుకు ప్రయత్నం. ఈ కొత్త టూల్ డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, MGNREGS వివరాలు, భవిష్యత్తులో విద్యుత్ బిల్లులు వంటి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న పత్రాలను తనిఖీ చేస్తుంది.
ఎవరెవరికి ఎక్కువ ప్రభావం ఉంటుంది?
యువత, కొత్త ఆధార్ తీసుకునేవారు ఇది ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఇక ఆధార్ కార్డు కోసం ముందు జాగ్రత్తగా డాక్యుమెంట్స్ సెట్ చేసుకోవాలి. విదేశీ పౌరులు, ట్రాన్స్జెండర్ వ్యక్తులు, చిన్నారులకు ప్రత్యేకమైన ప్రమాణాలు ఉండబోతున్నాయి. అయితే, ఆధార్ చట్టంలోని సెక్షన్ 9 ప్రకారం, ఆధార్ పత్రాన్ని పౌరసత్వం లేదా నివాసాన్ని నిరూపించడానికి ఉపయోగించరాదు.
ఈ మార్పుల వెనక అసలు ఉద్దేశం ఏమిటి?
ఇప్పటివరకు 140 కోట్లకు పైగా ఆధార్‌లు జారీ అయ్యాయి. వాటిలో చాలావరకు మోసపూరితంగా పొందబడినవీ ఉండొచ్చు. మరణించిన వ్యక్తులకు కూడా ఆధార్ అకౌంట్లు ఉండటం వంటి ఘటనలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశాయి. పుట్టిన వెంటనే శిశువులకు ఆధార్ జారీ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో, ప్రభుత్వం ఆధార్ పొందడంపై నిబంధనలను కఠినతరం చేసింది. అందుకే, UIDAI ఇప్పుడు పూర్తిగా ఆధార్ వ్యవస్థను పటిష్టంగా మార్చే పనిలో పడింది. మన దేశ భద్రత, ప్రజల వ్యక్తిగత డేటా గోప్యత, ప్రభుత్వ నిధుల సరైన వినియోగం కోసం ఇది ఒక పెద్ద అడుగు అని చెప్పొచ్చు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications