ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్ మార్చుకోవాలంటే ఇప్పటివరకు ఆధార్ సెంటర్ల చుట్టూ తిరగాల్సి వచ్చేది. బయోమెట్రిక్ వేయాలని, గంటల తరబడి క్యూలో నిలబడాలని ఇబ్బందులు పడేవాళ్లం. కానీ, భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) సామాన్యులకు ఒక అద్భుతమైన వార్త చెప్పింది. జనవరి 28, 2026 నుండి మీ స్మార్ట్‌ఫోన్ ద్వారానే "ఎక్కడైనా, ఎప్పుడైనా" ఆధార్ మొబైల్ నెంబర్ ను అప్‌డేట్ చేసుకునే సదుపాయాన్ని తీసుకువస్తోంది.

బయోమెట్రిక్ అవసరం లేదు.. ఫేస్ అథెంటికేషన్‌తో పని పూర్తి!
దశాబ్ద కాలంగా మొబైల్ నెంబర్ అప్‌డేట్ కోసం ఫిజికల్ సెంటర్లకు వెళ్లడం తప్పనిసరిగా ఉండేది. అయితే కొత్తగా రాబోతున్న ఫీచర్ ద్వారా, యూజర్లు తమ ఫోన్ కెమెరా సహాయంతో 'ఫేస్ అథెంటికేషన్' (ముఖ గుర్తింపు) ద్వారా తమ గుర్తింపును వెరిఫై చేసుకోవచ్చు. దీనివల్ల ఫింగర్ ప్రింట్ లేదా ఐరిస్ స్కాన్ కోసం ఆధార్ సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు.
యూజర్ల కోసం వచ్చే కీలక మార్పులివే..
జనవరి 28 నుండి అమల్లోకి రాబోతున్న కొత్త ఆధార్ యాప్ ద్వారా కలిగే ప్రయోజనాలు ఇవే:
- డైరెక్ట్ అప్‌డేట్: బయోమెట్రిక్ స్కాన్ అవసరం లేకుండానే కొత్త మొబైల్ నంబర్‌ను యాప్ ద్వారానే లింక్ చేయవచ్చు.
- డిజిటల్ ఆధార్: కొత్త "సెక్యూర్ క్యూఆర్ కోడ్" ఫీచర్ తో ఫిజికల్ ఆధార్ కార్డు జేబులో ఉంచుకోవాల్సిన అవసరం లేదు. హోటళ్లు, ఎయిర్‌పోర్ట్ లలో ఈ డిజిటల్ వెర్షన్ సరిపోతుంది.
- వర్చువల్ ఐడి (VID): మీ 12 అంకెల ఆధార్ నంబర్‌ను ఎవరికీ చెప్పకుండానే, వర్చువల్ ఐడి ద్వారా ఐడెంటిటీ వెరిఫికేషన్ చేసుకోవచ్చు.
- 24/7 సేవలు: ఆధార్ సెంటర్లు నిర్ణీత పని వేళల్లోనే ఉంటాయి, కానీ ఈ డిజిటల్ పోర్టల్ రోజులో ఎప్పుడైనా పనిచేస్తుంది.
జనవరి 28 తర్వాత అప్‌డేట్ చేయడం ఎలా? (స్టెప్-బై-స్టెప్)
- ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి లేటెస్ట్ ఆధార్ యాప్ (Aadhaar App) డౌన్‌లోడ్ చేసుకోండి.
- హోమ్ స్క్రీన్‌పై ఉన్న 'Mobile Update' ఆప్షన్‌ను ఎంచుకోండి.
- యాప్ సూచించిన విధంగా ఫేస్ అథెంటికేషన్ పూర్తి చేయండి.
- మీరు మార్చుకోవాలనుకుంటున్న కొత్త నంబర్‌ను ఎంటర్ చేసి OTP ద్వారా వెరిఫై చేయండి.
- నిర్దేశించిన నామమాత్రపు రుసుము (రూ. 50 ఉండవచ్చు) ఆన్‌లైన్‌లో చెల్లించండి.
అయితే కేవలం మొబైల్ నంబర్ అప్‌డేట్ మాత్రమే ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చు. ఒకవేళ 5 లేదా 15 ఏళ్ల పిల్లల ఫోటో లేదా బయోమెట్రిక్స్ అప్‌డేట్ చేయాల్సి వస్తే, ఖచ్చితంగా ఆధార్ సెంటర్‌కు వెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఆధార్ అప్ డేట్ కోసం.. ఒరిజినల్ యాప్ మాత్రమే వాడాలి. నకిలీ యాప్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని UIDAI హెచ్చరించింది.
ఏదేమైనా డిజిటల్ ఇండియా దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో.. UIDAI తీసుకువచ్చిన ఈ 'ఎనీటైమ్, ఎనీవేర్' సదుపాయం సామాన్యులకు పెను ఊరటనిస్తుంది. అయితే, ఈ ప్రక్రియలో భద్రత కూడా అంతే ముఖ్యం. మీ ముఖ గుర్తింపు (Face Authentication) ద్వారా జరిగే ఈ వెరిఫికేషన్ ప్రక్రియను కేవలం అధికారిక 'ఆధార్ యాప్' ద్వారానే పూర్తి చేయండి. జనవరి 28 నుండి అందుబాటులోకి రాబోతున్న ఈ సరికొత్త ఫీచర్‌ను ఉపయోగించుకుని మీ ఆధార్ వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోండి
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications