ఆధార్ కార్డు డెడ్ లైన్: మరోసారి 6 నెలల గడువు పెంపు.. ఇక ఫ్రీగా అప్‌డేట్ చేసుకోండి..
నేటితో ఆధార్ అప్ డేట్ గడువు ముగియనుండగా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) మరోసారి ఆధార్ అప్‌డేట్ గడువును మరో 6 నెలల పాటు పొడిగిస్తూ బిగ్ రిలీఫ్ అందించింది. ఇంతకుముందు ఆధార్ అప్‌డేట్ చివరి తేదీ 14 డిసెంబర్ 2024 ఉండగా ఇప్పుడు 14 జూన్ 2025గా పెంచింది. గతంలో ప్రతిసారి ఆధార్ అప్‌డేట్ చేసుకునేందుకు మూడు నెలల గడువు ఇస్తుండగా ఈసారి మాత్రం 6 నెలలకు ప్రభుత్వం పొడిగించింది. UIDAI ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ ద్వారా ఈ సమాచారాన్ని అందించింది.
ఈ ఉచిత సదుపాయం కింద ఆధార్ కార్డ్ హోల్డర్లు ఇప్పుడు 14 జూన్ 2025 వరకు ఆధార్ డేటాబేస్‌లో వారి ఆధార్ కార్డ్‌ను ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు . అంతకుముందు ఈ గడువును 14 డిసెంబర్ 2024 వరకు పొడిగించారు. కోట్లాది మంది ప్రజలు ఆధార్ లింక్డ్ డాక్యుమెంట్‌లను సకాలంలో అప్‌డేట్ చేయడానికి UIDAI ఈ చర్య తీసుకుంది.

దీనికి సంబంధించి యూఐడీఏఐ శనివారం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌వర్ ద్వారా కూడా సమాచారం ఇచ్చింది. ఆధార్ కార్డు ఉన్నవారికి ఫ్రీ ఆన్‌లైన్ డాక్యుమెంట్ అప్‌లోడ్ గడువును జూన్ 14, 2025 వరకు పొడిగించినట్లు ఆయన తెలిపారు . UIDAI ఉచిత డాక్యుమెంట్ అప్‌లోడ్ సదుపాయాన్ని పెంచడం వల్ల లక్షల మంది ఆధార్ హోల్డర్‌లు ప్రయోజనం చేకూరుస్తుంది. ఆధార్ డేటాబేస్‌లో గుర్తింపు, అడ్రస్ సంబంధిత డాకుమెంట్స్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఉచిత సేవ MyAadhaar పోర్టల్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆధార్ కార్డు 10 సంవత్సరాల కంటే పాతది లేదా ఇప్పటివరకు ఆధార్‌ను అప్‌డేట్ చేసుకోని వారు ఇప్పుడు ఆధార్ అప్‌డేట్ చేసుకోవాలని తెలిపారు. 14 జూన్ 2025 వరకు మై ఆధార్ పోర్టల్‌లో మాత్రమే ఆధార్‌ను ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు.
ప్రతి వ్యక్తి బయోమెట్రిక్ ఆధార్ తో అనుసంధానించడంతో ఒక నివాసి లేదా ఒక వ్యక్తికి రెండు ఆధార్ నంబర్స్ ఉండకూడదు. దీని వల్ల ఆధునిక ప్రపంచంలో లీక్‌లకు దారితీయకుండా ఇంకా మోసాలను గుర్తిస్తుంది. ఆధార్ ఆధారిత గుర్తింపు ద్వారా నకిలీలు, నకిలీ డేటా తొలగించి ప్రభుత్వాలు అర్హత కలిగిన వారికీ ప్రభుత్వ ప్రయోజనాలను అందించగలవు. మీరు భారతదేశంలో ఏ సమయంలోనైనా లేదా ఏ ప్రదేశంలోనైనా mAadhaar యాప్‌ని ఉపయోగించుకోవచ్చు. mAadhaar కేవలం వాలెట్-సైజ్ ఆధార్ కార్డ్ కంటే ఎక్కువ. mAadhaar ప్రొఫైల్ అనేది చట్టబద్ధమైన గుర్తింపు.


Click it and Unblock the Notifications