Aadhar New Rules: ఆధార్ కొత్త రూల్స్ తెలుసా? ఫేస్ అథెంటికేషన్ ఎలా పనిచేస్తుంది?
కేంద్ర ప్రభుత్వం ఇటీవల నోటిఫై చేసిన ఆధార్ కొత్త రూల్స్ (Aadhar New Rules) దేశంలో డిజిటల్ ఐడెంటిఫికేషన్ విధానాన్ని సమూలంగా మార్చబోతున్నాయి. ముఖ్యంగా ఫేస్ అథెంటికేషన్‌కు (Face Authentication) అధికారికంగా అనుమతి ఇవ్వడం, అలాగే వినియోగదారుల ప్రైవసీ నిబంధనలను కఠినతరం చేయడం ఈ మార్పుల్లో ప్రధానమైనవి. ఇది కేవలం ప్రభుత్వ సేవలకు మాత్రమే కాకుండా, ప్రైవేట్ సంస్థలు కూడా ఆధార్ వ్యవస్థను చట్టబద్ధంగా ఉపయోగించుకునే విధానంలో పెద్ద మార్పు తీసుకురాబోతోంది.

ఫేస్ అథెంటికేషన్ ఎందుకు కీలకం?
ఇప్పటివరకు ఆధార్ ధృవీకరణ అనేది వేలిముద్ర (Fingerprint), కన్ను (Iris Scan) లేదా OTP (వన్ టైమ్ పాస్‌వర్డ్) ఆధారంగా జరిగేది. ఇప్పుడు ఈ పద్ధతులతో పాటు ఫేస్ అథెంటికేషన్‌ను కూడా అధికారికంగా గుర్తించారు.
దీని వల్ల ఉపయోగాలు..
- వేలిముద్రలు సరిగ్గా పడని సందర్భాల్లో లేదా ఐరిస్ స్కాన్‌లు అందుబాటులో లేని చోట్ల ఫేస్ అథెంటికేషన్ చాలా కీలకం కానుంది.
- UIDAI అధికారులు దీనిని "ప్రూఫ్ ఆఫ్ ప్రజెన్స్"గా (Proof of Presence) చూస్తున్నారు. అంటే.. ధృవీకరణ జరిగే ప్రదేశంలో ఆధార్ హోల్డర్ భౌతికంగా ఉన్నారా? లేదా? అని నిర్ధారించడానికి ఇది ఉపయోగపడుతుంది.
- ఇది డిజియాత్ర (DigiYatra) తరహా గుర్తింపు తనిఖీలను పోలి ఉంటుంది. ఈ పద్ధతిని ఈవెంట్ ఎంట్రీ, హోటల్ చెకిన్స్, డెలివరీ అంగీకారం వంటి రోజువారీ అవసరాలకు విస్తరించడానికి అవకాశం ఉంది.
ప్రైవసీకి పెద్దపీట
ఆధార్ కొత్త రూల్స్ (Aadhar New Rules)లో ప్రైవసీకి పెద్ద పీట వేశారు. ఇటీవల అమలులోకి వచ్చిన డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (DPDP) చట్టానికి అనుగుణంగా ఈ నిబంధనలను కఠినతరం చేశారు. ఇందులో భాగంగా ఆధార్‌ను ఏ ప్రయోజనం కోసం ఉపయోగిస్తున్నారో స్పష్టంగా తెలియజేయాలి. తప్పనిసరిగా వినియోగదారుడి నుంచి స్పష్టమైన అనుమతి తీసుకోవాలి. అలాగే అవసరమైన కనీస డేటాను మాత్రమే అడగాలి. ఉదాహరణకు.. ఒక సేవకు కేవలం వయస్సు లేదా ఫోటో మాత్రమే అవసరమైతే.. అప్పుడు పూర్తి ఆధార్ వివరాలు ఇవ్వాల్సిన పనిలేదు. అవి రెండు ఇస్తే చాలు.
ఆఫ్‌లైన్ వెరిఫికేషన్.. ప్రైవేట్ వినియోగం
గతంలో కొన్ని ప్రైవేట్ వ్యాపార సంస్థలు OTP ఆధారిత పోర్టల్ యాక్సెస్ ద్వారా ఆధార్ వివరాలను సేకరించేవారు. ఇది చట్టబద్ధం కాదని UIDAI పేర్కొంది. ఆధార్ కొత్త రూల్స్ (Aadhar New Rules)ఈ గందరగోళాన్ని తొలగించాయి. ఇప్పుడు ఆధార్ వివరాలను UIDAI కేంద్ర డేటాబేస్‌తో సంబంధం లేకుండానే ఆఫ్‌లైన్‌లో ధృవీకరించడానికి అవకాశం ఉంటుంది. ఆధార్ హోల్డర్లు తమ డిజిటల్ సంతకం చేసిన వివరాలను QR కోడ్‌లు లేదా కొత్తగా రాబోయే ఆధార్ యాప్ ద్వారా థర్డ్ పార్టీలతో పంచుకోవచ్చు.
ఈ కొత్త యాప్ యూజర్ యొక్క డివైజ్ లోనే ఆధార్ వివరాలను ఉంచుతుంది. QR కోడ్‌ల ద్వారా ఎంపిక చేసిన వివరాలను మాత్రమే పంచుకునేలా చేస్తుంది. తద్వారా ప్రైవసీకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ విధంగా ఫేస్ అథెంటికేషన్ వంటి కొత్త పద్ధతుల ద్వారా ఇకపై వినియోగదారుల గోప్యతకు భంగం కలగకుండానే ఆధార్ సేవలను మరింత సులభంగా ఉపయోగించుకోవచ్చు.


Click it and Unblock the Notifications