For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Aadhaar: ఆధార్ కార్డును పదేళ్లకోసారి అప్‍డేట్ చేసుకోవాల్సిందేనా.. !

|

ప్రభుత్వం ఆధార్ నిబంధనలను సవరించింది, ఎన్‌రోల్‌మెంట్ తేదీ నుంచి 10 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఆధార్ హోల్డర్‌లు సపోర్టింగ్ డాక్యుమెంట్‌లను "కనీసం ఒక్కసారైనా" అప్‌డేట్ పేర్కొంది. ఎలక్ట్రానిక్స్, IT మంత్రిత్వ శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం, సెంట్రల్ ఐడెంటిటీస్ డేటా రిపోజిటరీ (CIDR)లో ఆధార్ సంబంధిత సమాచారం అప్ డేట్ చేసుకోవాలి. "ఆధార్ నంబర్ హోల్డర్లు, ఆధార్ కోసం నమోదు చేసుకున్న తేదీ నుంచి 10 సంవత్సరాలు పూర్తయిన తర్వాత, గుర్తింపు ప్రూఫ్ (POI), ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ (POA) పత్రాలను సమర్పించడం ద్వారా కనీసం ఒక్కసారైనా ఆధార్‌లో తమ సపోర్టింగ్ డాక్యుమెంట్లను అప్‌డేట్ చేసుకోవచ్చు.

తప్పనిసరి కాదు
అయితే ఆధార్ కార్డు 10 ఏండ్లుగా ఆధార్ అప్ డేట్ చేయకపోతే, తప్పనిసరిగా వాళ్ల వివరాలు అప్ డేట్ చేయాలని, లేదంటే ప్రభుత్వ పథకాలు అందవని చాలారోజులుగా ఓ వార్త ప్రచారంలో ఉంది. అయితే ఇది నిజం కాదని ఆధార్ యూఐడిఏఐ కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. ఆధార్ కార్డ్ అప్ డేట్ తప్పనిసరికాదని, ఎవరి వివరాలైతే అవుట్ డేటెడ్ గా ఉన్నాయో వాళ్లనే అప్ డేట్ చేసుకోవాలని చెప్పినట్టు ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

Aadhaar has said that it is not mandatory to update the Aadhaar card every 10 years

అప్‌డేట్ చేయడం మంచిది
"ఆధార్ హోల్డర్‌లు తమ డాక్యుమెంట్‌లను అప్‌డేట్ చేయమని ప్రోత్సహిస్తారు, ఇది జీవన సౌలభ్యం, మెరుగైన సర్వీస్ డెలివరీ, ఖచ్చితమైన ప్రామాణీకరణను కూడా అనుమతిస్తుంది. నివాసితులు ప్రతి 10 సంవత్సరాలు పూర్తి చేసిన తర్వాత " అప్ డేట్ చేసుకోవచ్చు" ఇది తప్పనిసరి కాదు" ట్విట్టర్ లో పేర్కొంది. ప్రస్తుతం అనేక ప్రభుత్వ పథకాలకు, సేవలు పొందడానికి ఆధార్ నెంబర్ తప్పనిసరి కాబట్టి, ఆధార్ కార్డ్ ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

English summary

Aadhaar: ఆధార్ కార్డును పదేళ్లకోసారి అప్‍డేట్ చేసుకోవాల్సిందేనా.. ! | Aadhaar has said that it is not mandatory to update the Aadhaar card every 10 years

Aadhaar has said that it is not mandatory to update the Aadhaar card every 10 years. Tweeted to this effect.
Story first published: Friday, November 11, 2022, 13:21 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X