Free Electricity: 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పై ప్రభుత్వం కీలక నిర్ణయం..!
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరుగ్యారెంటీలను ఒక్కొక్కటి అమలు చేస్తోంది. ఇప్పటికే మహిళలకు బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది. అలాగే ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచింది. త్వరలోనే రూ.500 లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించనున్నారు. దీనికి గృహజ్యోతి అనే పేరు పెట్టిన సంగతి తెలిసిందే. ఇందుకు ఇప్పటికే చర్యలు తీసుకుంటోంది. ఇంటింటికి తిరిగి ఆధార్ జిరాక్స్, రేషన్ కార్డు జిరాక్స్, అలాగే ఫోన్ నంబర్ లింక్ చేస్తున్నారు.
అయితే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పొందాలంటే.. లబ్ధిదారులకు ఆధార్ అథెంటిఫికేషన్ తప్పనిసరి చేస్తూ రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. సో మీరు గృహజ్యోతి ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పొందాలంటే.. ఆధార్ అథెంటిఫికేషన్ చేసుకోవాల్సిందే లేకుంటే ఉచిత విద్యుత్ ఉండదు. అధార్ అథెంటిఫికేషన్ కు సంబంధించి శుక్రవారం ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.

గృహజ్యోతి ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పొందాలంటే.. లబ్ధిదారులు తమ ఆధార్ నంబర్‌ను కలిగి ఉన్నట్లు ఫ్రూప్ తప్పని సరిగా సమర్పించాలని స్పష్టం చేసింది. ఆధార్ లేనివారు, ఇంకా నమోదు చేసుకోని అర్హులైన లబ్ధిదారులకు డిపార్ట్‌మెంట్ ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సౌకర్యం కల్పిస్తుందని తెలిపింది.
ఆధార్ బయోమెట్రిక్స్ ఫింగర్ ప్రింట్స్ రాని లబ్ధిదారులు ఐరిస్ స్కాన్, ఫేస్ అథెంటిఫికేషన్ చేసుకోవాలని సూచించింది. ఫింగర్ ప్రింట్, ఐరిస్ రానీ వారు డిపార్ట్‌మెంట్ ఫిజికల్ ఆధార్ లెటర్ల సమర్పించవచ్చు. క్యూఆర్ కోడ్‌ల ద్వారా, మైబైల్ ఓటీపీ ద్వారా ధృవీకరిస్తుందని నోటిఫికేషన్‌లో వివరించారు. ఆధార్ లేని వారు ఆధార్ ధ్రువీకరణ కోసం బ్యాంక్, పోస్టాఫీసు పాస్‌బుక్, పాన్ కార్డు, పాస్ పోర్ట్, రేషన్ కార్డు, ఓటరు కార్డు, ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు, పత్రాలతో ఆధార్ నమోదు చేయించుకోవాలని సూచించింది.


Click it and Unblock the Notifications