Rental Girlfriend: అద్దె గర్ల్‌ఫ్రెండ్స్.. కాఫీకి తీసుకెళ్తే రూ.1500, షాపిగ్కు రూ.4,500..
డబ్బులు సంపాదించడం ఎలా అని చాలా మంది ఆలోచిస్తుంటారు. అయితే ఎలా అయినా డబ్బులు సంపాదించొచ్చని కొంత మంది చెబుతున్న మాట. ముఖ్యంగా
జెన్ జెడ్ యూత్ డబ్బు సులభంగా సంపాదించవచ్చని చూపిస్తున్నారు. అయితే వారు ఎంచుకున్న మార్గమే కాస్త కలవరపాటుకు గురి చేస్తుంది. తాజాగా ఓ యువతి డబ్బు సంపాదన కోసం సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఆ పోస్ట్ తనను ఎవరైనా అద్దెకు తీసుకోవచ్చని రాసుకొచ్చింది. అంతే కాదు ఒక్కోదానికి ఒక్కో ధర ఫిక్స్ చేసింది.
తనను కాఫీ తీసుకెళ్తే, బైక్ రైడ్ తీసుకెళ్తే ఎంత, బైక్ డేట్ కు ఎంత, డేట్ ఫొటోలు సోషల్ మీడియాలో షేరు చేస్తే ఎంత అని ధరల పట్టికతో పాటు ఆమె తన ఫొటోను కూడా పోస్ట్ చేసింది. ఓ యువతి రెంట్ మీ ఫర్ ఏ డే అనే పేరుతో ఎక్స్ లో పోస్ట్ చేసింది. తనతో ఒక రోజు గడపడానికి పలు రకాల సేవలు అందిస్తున్నట్లు పేర్కొంది. ఈ పోస్ట్ ను ఎక్స్ లో నలిని ఉనాగర్ అనే యూజర్ షేరు చేశారు. దివ్య అనే మహిళ తనతో షాపింగ్, కాఫఈ, డిన్నర్, ఈవెంట్లు, టూర్ కు తోడుగా తీసుకెళ్తే అద్దె చెల్లించాలని తెలిపింది. యువతి ధరల పట్టక కూడా బయట పెట్టింది.

కాఫీ డేట్ కోసం అయితే రూ.15 వందలు చెల్లించాలి. డిన్నర్ + మూవీకి తీసుకెళ్తే రూ.2వేలు పే చేయాలి. ఫ్యామిలీని కలవడానికి తీసుకెళ్తే రూ.3వేలు ఇవ్వాలి. ఈవెంట్‌కు తోడుగా తీసుకెళ్తే రూ.3, 500 పే చేయాలి. బైక్ రైడ్ తీసుకెళ్తే రూ.4వేలు చెల్లించాలి. తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్టు చేయాలంటే రూ.6వేలు ఇవ్వాలి. అడ్వెంచర్ డే తీసుకెళ్తే రూ.5వేలు ఇవ్వాలి. కలిసి వంట చేస్తే రూ.3, 500 పే చేయాలి. షాపింగ్‌కు తోడుగా వెళ్తే రూ.4, 500 ఇవ్వాలి. రెండు రోజుల వీకెండ్ ట్రిప్ కు తీసుకెళ్తే రూ.10వేలు చెల్లించాలి.
కాగా ఈ పోస్ట్ పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఢిల్లీలో కొంతమంది యువతులు రెంటల్ గర్ల్‌ఫ్రెండ్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా డబ్బు సంపాదిస్తున్నారని పేర్కొంటున్నారు. గంటకు సుమారు రూ.1000 వరకు వసూలు చేస్తున్నారని తెలిపారు. రోజుకు మూడు నుంచి నాలుగు బుకింగ్‌లు వస్తే రూ.6వేల నుంచి రూ.7వేల వరకు ఆదాయం పొందే అవకాశం ఉందని కామెంట్ చేస్తున్నారు. అలాగే క్లయింట్లు భోజనం, షాపింగ్ వంటి ఖర్చులు కూడా భరిస్తారని ఓ యువతి తన కామెంట్ లో తెలిపింది.
మరో యువతి కూడా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. తనను రెంటల్ గర్ల్ ఫ్రెండ్ చెప్పుకుంది. తాను KoPartner.in అనే ప్లాట్‌ఫారమ్‌లో ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నానని తెలిపింది. పురుషులు తమను షాపింగ్, సినిమా, ట్రావెల్ వంటి కార్యక్రమాలకుబుక్ చేసుకుంటారని పేర్కొంది.


Click it and Unblock the Notifications