ఏడాదికి రూ.1.6 కోట్ల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదులుకుని కంటెంట్ క్రియేటరయ్యాడు.. చివరకు చేసిన తప్పు తెలుసుకుని..

కొన్నిసార్లు మనం తీసుకునే నిర్ణయాలు జీవితాన్నే తలకిందులు చేసే అవకాశం ఉంటుంది. చాలా మంది అరే అప్పుడు ఆ నిర్ణయం తీసుకోకుంటే ఇప్పుడు నా పరిస్థితి మరోలా ఉండేదని చెప్పుకుంటారు. అప్పుడే సాప్ట్ వేర్ సైడ్ వెళ్తే లక్షల్లో జీతాలు వచ్చేవని చాలా సందర్భాల్లో చెప్పి ఉంటారు. కానీ అప్పటికే పరిస్థితి చేయిజారి పోయి ఉంటుంది. ఇలా ఓ వ్యక్తి తీసుకున్న ఆయన జీవితాన్నే తలకిందులు చేసింది. ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి కంటెంట్ క్రియేషన్ ను కెరీర్ గా మార్చుకుని తన జీవితాన్ని నాశనం చేసుకున్నానని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కోట్ల రూపాయల జీతం వదులుకుని తప్పు చేసినట్లు ఒప్పుకున్నాడు.

క్రిస్టియన్ అనే సాఫ్ట్ వేరు ఉద్యోగి స్విట్జర్లాండ్ లో ఉంటూ మైక్రోసాఫ్ట్ కంపెనీలో పని చేసేవాడు. అతని జీతం సంవత్సరాని 200000 డాలర్లు. అంటే భారత కరెన్సీ ప్రకారం అతని సాలరీ రూ.1.6 కోట్లు. ఇంత మంచి జీతమున్న జాబ్ ను అతను వదిలేసుకున్నాడు. చివరికి తప్పు చేసినట్లు ఫీల్ అవుతున్నారు. సాఫ్ట్ వేరు ఇంజనీర్ గా ఉన్నప్పుడు కంటెంట్ చేస్తూ ఒక వ్యాపారం చేయాలనుకున్నాడు. ఇందులో భాగంగానే కంటెంట్ క్రియేటర్ కావాలని.. నిర్ణయించుకుని భారీ జీతమొచ్చే ఉద్యోగాన్ని వదలుకున్నాడు. ఆస్ట్రేలియాలో ఉండి.. కంటెంట్ క్రియేట్ చేయాలని.. అక్కడికి షిఫ్ట్ అయ్యాడు.

Man

అప్పటి వరకు అంతా బాగానే ఉంది. కానీ ఆ తర్వాత అతను కంటెంట్ క్రియేట్ చేసి ఒక డాలర్ సంపాదించడానికి చాలా టైమ్ పట్టింది. దీంతో అతని వద్ద సేవింగ్స్ మొత్తం ఖాళీ అయ్యాయి. దీనిపై అతను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మైక్రోసాఫ్ట్ ఉద్యోగం వదిలేయడం తన జీవితంలో చేసిన అత్యంత తెలివితక్కువ పని కావచ్చని రాసుకొచ్చాడు. ఎందుకంటే కార్పొరేట్ కంపెనీలు ఇచ్చే మంచి జీతం, లైఫ్ సెటిల్‌మెంట్, సమాజంలో వచ్చే గుర్తింపు... వీటన్నింటినీ వదిలేసి బయటకు రావడం అంత ఈజీ కాదన్నాడు. మైక్రోసాఫ్ట్‌లో ఉన్నప్పుడు చాలా మంచి లైఫ్ లీడ్ చేశానని, స్విట్జర్లాండ్‌లో జాబ్ చేయడం వల్ల యూరప్ మొత్తం తిరిగే అవకాశం వచ్చిందన్నాడు. కేవలం 26 ఏళ్ల వయసులోనే వాటన్నింటినీ వదిలేసి ఆస్ట్రేలియాకు షిఫ్ట్ ఇబ్బందుల పాలయ్యానని అన్నాడు.

కేవలం ఇంటర్నెట్‌లో బ్రాండ్ల కోసం వీడియోలు చేయడం కోసం అంత పెద్ద ఉద్యోగాన్ని వదిలేయడం ఇప్పుడు రిగ్రేట్ గా ఫీలవుతున్నట్లు చెప్పాడు. ఈపాటికి ఒక పెద్ద బిజినెస్‌మెన్ అవ్వాల్సింది. రిస్క్ తీసుకున్న తనకు తాను న్యాయం చేయలేకపోతున్నానేమో అనిపిస్తుందని రాసుకొచ్చాడు. ఎలాంటి ప్లాన్ లేకుండానే ఆస్ట్రేలియా వెళ్లి తప్పు చేశానని పేర్కొన్నాడు. అంతా కుదురుకోవడానికి ఐదు నెలల సమయం పట్టిందని తెలిపాడు. ఇంటికి వచ్చే వారం ముందే తనకు ఆన్ లైన్ మొదటి డాలర్ వచ్చినట్లు గుర్తు చేశాడు. అయితే ఏదీ ప్లాన్ ప్రకారం జరగదని గుర్తుంచుకోవాలన్నాడు. మంచి ఉద్యోగాన్ని వదులుకుంటే.. జీవితంలో ఎలాంటి కష్టాలు వస్తాయో అందరికి తెలియడానికే ఇన్ స్టాగ్రామ్ ఈ పోస్ట్ పెట్టినట్లు క్రిస్టియన్ తెలిపాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+